పెళ్లైన ఏడాదికే స్టార్ హీరోయిన్ విడాకులు..?
ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని ఓ సర్వేలో తేలింది. ఇందులో సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విడాకులు బాట పట్టిందనే ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరి పరిణితి చోప్రా గురించి అందరికి సుపరిచితురాలే. పరిణితి చోప్రాకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రియాంక చోప్రా సోదరిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి అనతి కాలంలోనే తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ,తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కెరీర్ పీక్ టైంలోనే ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది. అయితే ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆమె తాజాగా చేసిన పోస్ట్‌ను చూసిన వారెవ్వరైనా సరే , పరిణితి చోప్రా విడాకులు తీసుకుంటుందనే భావిస్తారు. ''జీవితాన్ని ప్రతిబింబించడానికి కొంత సమయం తీసుకున్నాను మరియు ఇది నా నమ్మకాన్ని పునరుద్ఘాటించింది: మైండ్‌సెట్ అనేది ప్రతిదీ...అప్రధానమైన విషయాలకు (లేదా వ్యక్తులు) ప్రాముఖ్యత ఇవ్వకండి. ఒక్క సెకను కూడా వృధా చేయకు. జీవితం ఒక గడియారం..ప్రతి క్షణం మీ ఇష్టం.. ఇతరులను ఆకట్టుకోవడానికి జీవించడం మానేయండి! మీరు ఇతరుల అభిప్రాయానికి భయపడినప్పుడు, మీరు మీ స్వంత జీవితాన్ని గడపడం మానేస్తారు.
మరియు మీ చివరి రోజున, పెద్ద పశ్చాత్తాపం ఉండదు.మీ తెగను కనుగొనండి. మీ జీవితం నుండి విషపూరితమైన వ్యక్తులను విసిరేయడానికి భయపడకండి.ప్రపంచం ఏమనుకుంటుందో దాని గురించి పట్టించుకోవడం మానేయండి. మిమ్మల్ని మరియు మీ ప్రజలను సంతోషపెట్టండి.విషయాల పట్ల మీ ప్రతిచర్యలను మార్చండి. ఇది ఆనందానికి కీలకం.జీవితం పరిమితమైనది. అది ఇప్పుడు జరుగుతోంది.మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో అలా జీవించండి'' అని రాసుకొచ్చింది. దీంతో ఈ భామ విడాకులకు రెడీ అయిందనే , అందుకే ముందుగానే ఇలా హింట్ ఇస్తుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పుకార్లపై ఈ భామ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications