యంగ్ బ్యూటీకి నూరేళ్లు నిండాయ్.. గుండెపోటుతో సోషల్ మీడియా స్టార్ మృతి !!
హర్యాన మ్యూజిక్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి, సోషల్ మీడియా స్టార్ Divyanka Sirohi (29) ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ విషాదవార్త ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం రాత్రి ఘజియాబాద్‌లోని ఆమె నివాసంలో గుండెపోటుకు గురైన ఆమె కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆకస్మిక మరణం..
చాలా చిన్న వయసులోనే దివ్యాంక మరణించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. ఆరోగ్య సమస్యల గురించి ముందుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో, ఆమె ఆకస్మిక మృతి మరింత కలిచివేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, మరణానికి కొన్ని రోజుల ముందే పోస్టులు చేయడం కూడా అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.

కాగా సాధారణ ఉద్యోగాన్ని వదిలి, నటనపై ఉన్న అభిరుచితో దివ్యాంక మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. Meri Mummy Nu Pasand Ni Tu పాటకు చేసిన డ్యాన్స్ వీడియోతో ఒక్కసారిగా వైరల్ అయి, రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించారు. తన కృషి, పట్టుదలతో ఎంతో తక్కువ సమయంలోనే టాప్ మ్యూజిక్ వీడియో నటి స్థాయికి చేరుకున్నారు.
ఇక దివ్యాంక 50కి పైగా హిట్ మ్యూజిక్ వీడియోల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. Masoom Sharma, Amit Saini Rohtakiya వంటి ప్రముఖ గాయకులతో చేసిన పాటలు యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్ సాధించాయి. ఆమె స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ స్కిల్స్ వల్ల యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది.
అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షలకు పైగా ఫాలోవర్లతో దివ్యాంక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు. ఫ్యాషన్, డ్యాన్స్, లైఫ్‌స్టైల్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకునేవారు. బ్రాండ్ ప్రమోషన్స్, ఈవెంట్స్ ద్వారా కూడా ఆమెకు మంచి ఆదరణ లభించింది. మరోవైపు ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications