దీపావళి విన్నర్ ఈ మూవీనే..? కలెక్షన్లతో బాక్సాఫీస్ ర్యాంపేజ్..
తెలుగు రాష్ట్రాల్లో పండగలకు సినిమాలు రిలీజ్ కావడం మనం చూస్తుంటాం. సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా ప్రతి పెద్ద పండక్కు మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. పండగ సీజన్ లో రిలీజయ్యే సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు రికార్డ్ కలెక్షన్స్ వస్తుంటాయి. అందువల్ల ఏడాది ముందు నుంచే దర్శక నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ వారం దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ మూవీతోపాటు ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, సిద్ధూ జొన్నలగడ్డ తెలుసుకదా చిత్రాలు బరిలో నిలిచాయి.
అయితే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఆడియెన్స్ కు కావాల్సిన మాస్ అంశాలు, యూత్ కు కావాల్సిన లవ్, రొమాంటిక్ ఎలిమెంట్స్ అలాగే ఫ్యామిలీతోపాటు అందరికీ కావాల్సిన కామెడీ అంశాలను జోడించి ఈ సినిమాని తీశారు. ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ తెచ్చుకుందీ మూవీ. కే ర్యాంప్ సినిమా కలెక్షన్ల పరంగానూ దుమ్ములేపుతుంది. ఈ మూవీకి రెండు రోజుల్లోనే ఏకంగా నాలుగు కోట్ల షేర్ రావడం విశేషం. దీంతో ఈ మూవీ దాదాపు 60 శాతం రికవరీ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ దివాలీ విన్నర్ గా నిలిచిందంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా దీపావళి సినిమాలను డామినేట్ చేసిందని మరికొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలోనూ ఈ మూవీకి కలెక్షన్లు గట్టిగానే వస్తున్నాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీతో యాట్రిక్ హిట్స్ కొట్టాడు. లవ్ టుడే, డ్రాగన్ మూవీస్ తర్వాత డ్యూడ్ మూవీ కూడా హిట్ కావడంతో వరుసగా యాట్రిక్ హిట్స్ కొట్టిన యంగ్ హీరోగా ప్రదీప్ రంగనాథన్ నిలిచాడు.

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన తెలుసుకదా మూవీ అక్టోబర్ 17 న విడుదలైంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ మూవీతో సిద్ధూ సరసన శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీకి నీరజ కోన దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఒక సెక్షన్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పెద్దగా వసూళ్లు రావడం లేదు. ఓవర్సీస్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications