మన తెలుగు హీరోలు ఎంత ఇన్‌కంటాక్స్ కట్టారో తెలుసా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వార్త వైరలవుతోంది. బాలీవుడ్ బాద్ షా క్రికెటర్ విరాట్ కోహ్లిని మించి ఎక్కువగా ఆదాయపు పన్ను కట్టాడనేది ఆ వార్త సారాంశం. జాతీయస్థాయిలో అత్యధిక ఆదాయపు పన్ను కట్టినవారి జాబితా విడుదలైంది. షారుక్ ఖాన్ రూ.92 కోట్లు కడితే కింగ్ కోహ్లి రూ.66 కోట్లు కట్టారు. ఆయన తర్వాత స్థానంలో ఇళయ దళపతి విజయ్ ఉన్నారు. విజయ్ రూ.80 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. మూడో స్థానంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిలిచారు. ఆయన రూ.75 కోట్లు చెల్లించారు.
అమితాబ్ బచ్చన్ రూ.71 కోట్లతో నాలుగోస్థానంలో, రూ.66 కోట్లతో విరాట్ కోహ్లి ఐదోస్థానంలో నిలిచారు. ఆరో స్థానంలో రూ.42 కోట్లతో అజయ్ దేవగణ్, ఏడోస్థానంలో రూ.38 కోట్లు చెల్లించి ధోనీ నిలిచారు. రూ.36 కోట్లు చెల్లించి రణబీర్ కపూర్ ఎనిమిదో స్థానంలో, రూ.28 కోట్లతో హృతిక్ రోషణ్, సచిన్ టెండూల్కర్ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఆదాయపు పన్ను చెల్లించినవారి జాబితాలో టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ పేరు ఉంది. ఆయన రూ.14 కోట్లు పన్ను చెల్లించారు. బన్నీతో సమానంగా మోహన్ లాల్ కూడా రూ.14 కోట్లు చెల్లించారు.

అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ పేరు ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యమనిపించింది. అలాగే మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటివారు కూడా భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నారు. టాప్ 20 జాబితాలో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. సౌరవ్ గంగూలీ- రూ.23 కోట్లు, హార్దిక్ పాండ్యా- రూ.13 కోట్లు, రిషబ్ పంత్ - రూ.10 కోట్లు చెల్లించారు. భవిష్యత్తులో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించేవారి జాబితాలో మన తెలుగు నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటివారు కూడా నిలుస్తారంటున్నారు. ఎందుకంటే వీరంతా సినిమాకు రూ.100 కోట్లపైనే పారితోషికాన్ని అందుకుంటున్నారు. ప్రభాస్ అయితే రూ.150 కోట్లు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications