సానియా మీర్జా భరణం కింద ఎంత తీసుకుందో తెలుసా..?

టెన్నిస్ సంచలనం సానియా మీర్జా విడాకుల వార్త సంచలనంగా మారింది. పాకిస్థానీ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్‌‌ను సానియా 2010లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇజాన్ మీర్జా అనే మగబిడ్డ ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా అభిప్రాయభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. సానియా మీర్జా ఉండగానే పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌‌తో షోయబ్‌ గత కొంతకాలంగా ఎఫైర్ నడుపుతున్నాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి.

అటు షోయబ్‌ కూడా భార్య సానియా మీర్జాతో కన్నా సనా జావేద్‌తో తరుచూ కనిపిస్తుండటంతో ఈ రుమర్స్ నిజమే అని అంతా భావించారు. సానియా మీర్జాకు విడాకులు ఇవ్వకుండానే సనా జావేద్‌తో షోయబ్‌ సహజీవనం చేస్తున్నాడని..దీని కారణంగానే సానియా షోయబ్ నుంచి విడిపోయిందని తెలుస్తోంది. ఇక సనా జావేద్‌‌నే షోయబ్‌ పెళ్లి చేసుకోవడంతో ఇదింతా నిజమే అని నెటిజన్లు భావిస్తున్నారు.

 Do you know how much Sania Mirza took as alimony?

షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సంప్రదాయం ప్రకారమే సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు. తాజాగా సానియా మీర్జా భరణానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్త నుంచి విడిపోయిన తరువాత భార్య అతని దగ్గర నుంచి ఎంతో కొంత భరణం అడగడం సహజంగా వస్తోంది.

కానీ సానియా మాత్రం భర్త షోయబ్ నుంచి ఒక్క రూపాయి కూడా తనకు అక్కర్లేదని తేల్చి చెప్పిందట. పైసా తీసుకోకుండానే విడాకుల పేపర్లపై సంతకం చేసి అక్కడ నుంచి వచ్చేసిందనే వార్త ఇప్పడు హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇది విన్న నెటిజన్లు..''దటీజ్ ఇండియన్ గర్ల్ పవర్'' అంటూ సానియాకు మద్దుతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+