నటి పవిత్ర గౌడ ఫస్ట్ సినిమా పారితోషికం ఎంత ?, కోట్లలో ఉంటుందా అంటే, కాదు?
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన నటుడు దర్శన్ అండ్ గ్యాంగ్ చేసిన పాశవిక చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని కన్నడ మీడియా అంటోంది. రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు ప్రస్తుతం ఉన్న ఆస్తుల గురించి తెలుసుకున్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు విశాల్ (ఉమేష్ గౌడ) పవిత్ర గౌడ సినీ పరిశ్రమలో తొలిరోజుల గురించి సంచలన సమాచారాన్ని వెల్లడించాడు. కన్నడ సినిమా రంగానికి పవిత్ర గౌడను పరిచయం చేసింది తానే అని దర్శకుడు విశాల్ అన్నారు. 2013లో విశాల్ దర్శకత్వంలో అగమ్య అనే సినిమా తెరకెక్కి అయితే రెండు సంవత్సరాల క్రితం ఆ సినిమా షూటింగ్ మొదలైయ్యింది. పవిత్ర గౌడకి ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో క్లైమాక్స్ వరకు పవిత్ర గౌడ పేరు ఎక్కడా వినపడలేదని, ఆసలు మా లిస్టులో ఆమె పేరులేదని విశాల్ అన్నారు.

విశాల్ చాలా మంది నటీమణులను సంప్రదించాడు. అయితే అందరు హీరోయిన్ల బడ్జెట్ ఎక్కువైంది. తక్కువ బడ్జెట్ సినిమా కావడంతో ఎవరూ ఆ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. మరికొందరు కాస్త ఎక్కువ బడ్జెట్‌ను అడిగారు. అంత డబ్బులు ఇవ్వడానికి మేము సిద్దం అయినా వారికి డేట్లు కుదరకపోవడంతో వారిని ఆగమ్య సినిమాలో హీరోయిన్ గా తీసుకోలేదని దర్శకుడు విశాల్ అన్నారు. అలా చివరకు పవిత్ర గౌడకు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఆఫర్ వచ్చింది.
అయతే పవిత్ర గౌడకు నటన రాదని విశాల్ అన్నారు, తాను ఎన్నోసార్లు షూటింగ్ సమయంలో ఆమె మీద కేకలు వేశానని దర్శకుడు విశాల్ అన్నారు. కానీ మన హీరోయిన్ బడ్జెట్ 20 వేలు మాత్రమే. పవిత్ర గౌడకు నటన రాకపోవడంతో తాను షూటింగ్ లోనే చాలా సార్లు ఆమెను తిట్టానని దర్శకుడు విశాల్ చెప్పారు. పవిత్ర గౌడ కథానాయికగా నటించింది. ఆ సినిమాలో నటించినందుకు ఆమెకు పారితోషికం రూ. 20,000 చెల్లించానని విశాల్ తెలిపాడు.

2011లో షూటింగ్ ప్రారంభించాం ఆ సమయంలో కోననకుంటెలోని సింగ్ బెడ్ రూమ్ అద్దె ఇంటిలో పవిత్ర గౌడ నివాసం ఉండేదని, సినిమా షూటింగ్‌కి ఆటోలోను, లేదంటే బీఎంటీసీ బస్సులోనో వచ్చేదని విశాల్ చెప్పాడు. అయితే ఆగమ్య సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ పొందలేదని ఆ సినిమా దర్శకుడు విశాల్ చెప్పారు. కానీ ఒక్క సినిమా పవిత్ర గౌడ జీవితాన్ని మార్చేసింది. దర్శన్‌కి ఎప్పుడు పరిచయం అయ్యిందో, ఆయనతో ఎప్పుడు సంబంధం ఏర్పడిందో నాకు తెలియదు కాని కొద్ది రోజుల్లోనే పవిత్ర గౌడ మినీ కూపర్ కారులో తిరగడం మొదలుపెట్టిందని దర్శకుడు విశాల్ అన్నాడు.
తరువాత నటి పవిత్ర గౌడ జేపీ నగర్‌లో ఇల్లు కట్టుకున్నదని విశాల్ తెలిపాడు. పవిత్ర గౌడకు ఆర్‌ఆర్‌నగర్‌లో మూడంతస్తుల ఇల్లు ఉంది. ఆమెకు రేంజ్ రోవర్ తో సహా చాలా కార్లు ఉన్నాయని విశాల్ తెలిపారు. దర్శన్ తో ఎందుకు సంబంధం పెట్టుకుందో, ఆయన జీవితంలో పవిత్ర గౌడ ఎందుకు ప్రవేశించిందో తెలియదు. అయితే తప్పు చేసిన వారిని శిక్షించాలి. ఇలాంటి ఘటనలను సహించేది లేదని కన్నడ దర్శకుడు విశాల్ అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications