Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajinikant Love story:రజినీ లవ్ చేసింది ఎవరినో తెలుసా..ఫ్లాష్ బ్యాక్ ఇదే..!!

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఫ్యాన్ బేస్ గురించి చర్చే అక్కర్లేదు. ఏడు పదుల వయసులోను సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్న ఘనత ఆయన సొంతం. శివాజీరావు గైక్వాడ్‌గా పుట్టి రజినీకాంత్‌గా వెండితెరను ఏలుతున్నాడు. రజినీకాంత్ జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ ఆయనకు కూడా ఓ క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ ఉందన్న విషయం తెలుసా.. బాషా ఎలా ప్రేమలో పడ్డారో తెలుసా.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఒకసారి చూసేద్దామా..!

రజినీ జీవితాన్ని మార్చేసిన భార్య
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీలో కింగ్ అయినప్పటికీ కూడా తన భార్య లత దగ్గర మాత్రం సేవ చేసే సేవకుడిలానే ఉంటారు. లతతో పెళ్లి అయ్యాక తన జీవితంలో చోటు చేసుకున్న అద్భుతాలన్నిటి వెనక ఆమె హస్తం ఉందని రజినీ ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చిన ఆమెకు తప్పక కృతజ్ఞతలు చెబుతుంటాడు ఈ "ముత్తు". ఇక లత అంటే తనకు ఎంత ఇష్టమో పలు బహిరంగ వేదికలపైనే రజినీకాంత్ చెబుతుంటాడు. తన జీవితాన్నే మార్చేసిన గొప్ప మహిళగా ఆమెను అభివర్ణిస్తుంటారు. తను కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా సిగరెట్, మద్యం, మాంసాహారంకు బానిసగా ఉండేవాడినని, అయితే లత తన జీవితంలోకి వచ్చాక తను ఈ మూడింటికి దూరం అయినట్లు వెల్లడించాడు.తనను క్రమశిక్షణలో పెట్టిందని వెల్లడించాడు.

do-you-know-the-love-story-of-superstar-rajinikanth-who-proposed-first

రజినీ లవ్ స్టోరీ
ఇక ఇదంతా ఇలా ఉంటే కండక్టర్ స్థాయి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక సూపర్ స్టార్‌గా ఎదిగాడు రజినీకాంత్. అయితే రజినీకాంత్ కూడా రియల్ లైఫ్‌లో లవర్ బాయ్ అన్న విషయం బహుశా చాలా తక్కువమందికి తెలుసు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక రజినీ కాంత్ అప్పుడప్పుడే స్టార్‌డమ్ తెచ్చుకుంటున్న రోజులవి. అదే సమయలో ఒక కాలేజ్ మ్యాగజీన్‌ నుంచి తన ఇంటర్వ్యూ కావాలంటూ రజినీకి ఒక సందేశం అందింది. రజినీని ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నచ్చడంతో ఈ నరసింహ తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. అసలు ఇంటర్వ్యూ అలా అయ్యిందో లేదో... రజినీ తన ప్రేమను దాచుకోలేక వెంటనే బయటకు కక్కేశాడు. ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి మరెవరో కాదు..మనం ఇంత సేపు చెప్పుకున్న ఆయన భార్య లత.

ప్రేమగా మారిన స్నేహం
తన ప్రేమను వ్యక్తపరిచగలిగాడు కానీ.. ఆమె నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు బాషా షాక్ అయ్యాడు. ఎప్పుడైతే లతకు ఐ లవ్ యూ అని చెప్పేసి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడో...ఆమె ముందుగా తన తల్లిదండ్రులతో ఈ విషయం మాట్లాడాలని సున్నితంగా చెప్పేసిందట. ఆ సమయంలో ఇద్దరూ బెంగళూరులో నివాసం ఉండేవారు. ఇక ప్రేమ సంగతి అటుంచితే అప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితుల్లా మెలిగారు. ఆ స్నేహం క్రమంగా ముదిరి ఇద్దరి మధ్య ప్రేమగా మరింత బలపడింది. ఇక రజినీ ఒక మంచి రోజు చూసుకుని లత తల్లిదండ్రుల వద్ద ఆమెను పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని చెప్పేశాడు. లత తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 1981లో తిరుమలలో చాలా సింపుల్‌గా ఇద్దరూ దంపతులుగా మారారు. రజినీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య.

ఐశ్వర్య తమిళ హీరో ధనుష్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరూ విడాకులు తీసుకుని వేరయ్యారు. రజినీకాంత్ భార్య లత ఎక్కువగా వార్తల్లో లేదా మీడియాలో కనిపించరు. ఆమె పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. భర్త రజినీకాంత్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఆమె మాత్రం ఒక స్కూలును నడపుతున్నారు. ఇదండీ రజినీకాంత్ క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+