అల్లు అర్జున్ కోసం లాయర్ నిరంజన్‌రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా?

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా పడింది. ఆరోజు ఆయన హైకోర్టుకు హాజరుకాబోతున్నారు. కోర్టులో ఏం చెప్పబోతున్నారు? అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ దోషి అని తేలితే శిక్ష పడుతుందా? లేదంటే ఏమవుతుంది? అనే ప్రశ్నలు ప్రజలను తొలిచేస్తున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కేసు ఉపసంహరించుకుంటాని చెబుతున్నప్పటికీ చిక్కడపల్లి పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేసి బన్నీపై సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసు నుంచి బన్నీ బయటపడాలంటే ఒకటే మార్గం ఉందని అతని లాయర్ నిరంజన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు కేసు ఉపసంహరించుకునేలా
పోలీసులతో మాట్లాడి వారు స్వచ్ఛందంగా పెట్టిన కేసును ఉపసింహరించుకునేలా చేయడానికి ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందుకు తనకున్న పలుకుబడిని, పరిచయాలను ఉపయోగిస్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసును ఉపసంహరించుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతోపాటు సినీ పరిశ్రమపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కనీసం ఒక్కరు కూడా పరామర్శించలేదు. సీఎం విమర్శించాడు కాబట్టి అల్లు అర్జున్ కోటిరూపాయలు, సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు కలిసి రూ.2 కోట్ల చెక్ ను శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందించారు.

Do you know what Lawyer Niranjan Reddy is doing for Allu Arjun

వందల సంఖ్యలో వీడియోలున్నాయి
పోలీసులకు సాక్ష్యాలుగా వందల సంఖ్యలో వీడియోలున్నాయి. పోలీసులు వద్దనుకుంటే ప్రభుత్వ న్యాయవాది కేసును బలహీనంగా వాదించి బన్నీకి రెగ్యులర్ బెయిల్ వచ్చేలా చేస్తారు. అలా కాకుండా పోలీసుల అభిప్రాయాలను గౌరవించాలని రేవంత్ రెడ్డి భావిస్తే ఆయన ఈ కేసులో జోక్యం చేసుకోరు. చట్ట ప్రకారం యథావిధిగా జరిగిపోతుంది. అల్లు అర్జున్ తప్పు చేశాడని పోలీసులు కోర్టులో నిరూపించాలి. వారి ముందు సాక్ష్యాలున్నాయి. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటే వీటిని కోర్టుకు సమర్పించే అవకాశాలు తక్కువ. ఇప్పుడు నిర్ణయం మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కావాలని కోరడంతో రేవంత్ తగ్గారని, ఈ కేసు నుంచి బన్నీ బయటపడటానికి అవకాశాలున్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా అనవసరంగా అల్లు అర్జున్ వల్ల ముఖ్యమంత్రి ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+