రవితేజతో లవర్‌గా, వదినగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఆమె..!
యాక్టర్ల అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను ఆ పాత్రలో మాత్రమే కనిపిస్తానంటూ గిరి గీసుకుని కూర్చుంటే ఇక్కడ అవకాశాలు దక్కవు. అయితే ఓ సినిమాలో హీరో పక్కన హీరోయిన్‌గా నటించిన ఓ భామ, అదే హీరో లవర్‌గా, వదినగా కూడా నటించడం అంటే సాధారణ విషయం కాదు. అలా నటించింది మరెవ్వరో కాదు.. రవితేజ-శృతి హాసన్. వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు. బలుపు, క్రాక్, వాల్తేరు వీరయ్య. ఈ మూడు సినిమాల్లో కూడా రవితేజ-శృతి హాసన్ మూడు రకాలుగా కనిపించారు.
బలుపు సినిమాలో రవితేజకు లవర్‌గా కనిపించిన శృతి హాసన్, క్రాక్ సినిమాతో రవితేజకు భార్యగా కనిపించారు. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఆయన తమ్ముడు పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించారు. అంటే రవితేజకు వదిన అవుతారన్న మాట. ఇలా మూడు సినిమాల్లో మూడు ప్రత్యేక పాత్రల్లో శృతి హాసన్ కనిపించి అలరించారు. విచిత్రం ఏమిటంటే ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి.

అయితే రవితేజ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. మిస్టర్ బచ్చన్, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రామారావు ఆన్ డ్యూటీ వంటి వరుస ఫ్లాపులను రవితేజ ఎదుర్కొన్నారు. మరోవైపు శృతి హాసన్ మాత్రం వరుస బ్యాక్ బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 2023లో ఆమె ఖాతాలో రెండు హిట్లు చేరాయి. బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. ప్రభాస్‌తో నటించిన ''సలార్'' శృతి హాసన్ ఖాతాలో మరో హిట్ చేరింది.












Click it and Unblock the Notifications