చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
హీరోలతో పోలిస్తే.. హీరోయిన్ల కెరీర్ తక్కువగా ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు 60 ఏళ్లు వచ్చినా , ఇప్పటికీ హీరోలుగానే నటిస్తున్నారు. వారితో నటించిన హీరోయిన్లు మాత్రం ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తున్నారు. హీరోయిన్ల కెరీర్ తక్కువ సమయం ఉంటుంది ,కాబట్టి వాళ్లు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడరు. ఇప్పటి తరం హీరోయిన్ల నుంచి పాత తరం హీరోయిన్లు సైతం ఇదే ఫార్ములానే ఫాలో అయ్యారు.
ఓ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి సరసన భార్యగా, తల్లిగా , చెల్లెలుగా, అక్కగా నటించి మెప్పించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు..దివంగత నటి సుజాత. చిరంజీవి స్టార్‌డమ్ సాధిస్తున్న దశ నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా, సుజాత ఆయనకు రొమాంటిక్ జోడీగా, చెల్లెలిగా, అక్కగా, చివరికి తల్లిగా నటించడం విశేషం.

చిరంజీవి స్టార్‌గా ఎదుగుతున్న తొలినాళ్లలో, కృష్ణంరాజు ప్రధాన పాత్రలో వచ్చిన 'ప్రేమ తరంగాలు'చిత్రంలో ఆయనకు సెకండ్ హీరో పాత్ర దక్కింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటి సుజాత నటించారు. ఆమె చిరంజీవితో కలిసి రొమాంటిక్ పాత్ర పోషించిన ఏకైక సినిమా ఇదే కావడం ఒక ప్రత్యేకమైన విషయం.
ఆ తరువాత, చిరంజీవి హీరోగా నటించిన 'సీతాదేవి' చిత్రంలో సుజాత పాత్ర పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రంలో సుజాత, చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధించినా, నటిగా సుజాత పాత్రల వైవిధ్యాన్ని నిరూపించింది.
మెగాస్టార్‌గా చిరంజీవి సుప్రీం హీరోగా స్టార్‌డమ్‌కు చేరిన తరువాత, క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'అగ్ని గుండం'లో ఈ అరుదైన కాంబినేషన్ మళ్లీ కనిపించింది. ఈ సినిమాలో సుజాత చిరంజీవికి అక్క పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, సుజాత పోషించిన అక్క పాత్ర అభిమానుల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.
చిరంజీవి, విజయ బాపినీడుల హిట్ కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా 'బిగ్ బాస్'. అప్పటికే హీరోయిన్‌గా కెరీర్ ముగించుకున్న సుజాత క్యారెక్టర్ రోల్స్‌కు మారడంతో, విజయ బాపినీడు ఆమెను చిరంజీవి తల్లి పాత్ర కోసం తీసుకున్నారు. ఈ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించకపోయినా, సుజాత పోషించిన తల్లి పాత్ర మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి, భావోద్వేగాలను పండించింది. ఇలా చిరంజీవి సరసన విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు సుజాత.












Click it and Unblock the Notifications