నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌కు కాబోయే వరుడు ఎవరో తెలుసా..?
లేడి విలన్‌గా అలరిస్తోన్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అందరికి సుపరిచుతురాలే. ఈ నటి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. మార్చి1వ తేదిన ఆమె నిశ్చితార్థ వేడుక నికోలయ్ సచ్‌దేవ్‌తో ముంబైలో రహస్యంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే విచ్చేశారు. నటి వరలక్ష్మి వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోనుంది. అయితే, నిన్న జరిగిన ఎంగేజ్‌మేంట్ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఇంతకీ వరలక్ష్మీ పెళ్లి చేసుకునే నికోలయ్ సచ్‌దేవ్ ఎవరా? అని అందరి మదిలో మెదలుతుంది.
నటి వరలక్ష్మి తమిళనటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించిన ఆమె ఆ తరువాత విలన్ పాత్రలు, విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో కనిపించి మెరిసింది నటి వరలక్ష్మి. ఈ సినిమా బాక్సాఫీస్ ఎంతటి వసూళ్లను రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఇక, ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. టాలీవుడ్‌లో, కోలివుడ్‌లో కూడా ఆమె బిజి బిజిగా ఉన్నారు. రాయన్‌లోనూ వరలక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మళయాళంలో కలర్స్ చిత్రం, తెలుగులో శబరి చిత్రాల్లో నటిస్తున్నారు.

పద్నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో : ఇక, ఇప్పడు నెట్టింట వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్ హాట్‌టాఫిక్‌గా మారింది. ఇంతకీ వరలక్ష్మీ కాబోయే వరుడు ఎవరో? తెలుసుకుందాం. అతని పేరు నికోలయ్ సచ్‌దేవ్. అతను ముంబైకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. తను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడు. నికోలయ్ సచ్‌దేవ్ ఆన్‌లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. నటి వరలక్ష్మికి అతనికి గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమచారం. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజిగా ఉండడం వల్ల వచ్చే సంవత్సరం వీరి వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications