ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో రాజశేఖర్ పారితోషికం ఎంతో తెలుసా?
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ఇటీవలే విడుదలైన నితిన్ చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితిన్ కుటుంబ సభ్యులే నిర్మించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఒక్కడే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని దర్శకుడు వక్కంతం వంశీ భావించారు.
ఆ పాత్రలో నటించేందుకు రాజశేఖర్ ను చిత్ర బృందం సంప్రదించింది. వంశీ పట్టుబట్టడంతో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తప్పనిసరై రెండున్నర కోట్లరూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. గతవారం విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుందికానీ కోరుకున్న స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రావడంలేదు. ఒకరకంగా ఈ సినిమా ఫ్లాప్ కేటగిరి కిందకు వెళ్లిపోయింది. ఈ చిత్రంలో రాజశేఖర్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమాలో మొదటి భాగం అంతా వినోదాత్మకంగా సాగుతుంది. రెండో భాగంలో కథ లేకుండా డైరెక్టర్ కేవలం కొన్ని పాత సినిమాలోని డైలాగులను సృష్టించినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ లో చూపించినట్టు జీవిత అనే సరదా సన్నివేశం మాత్రమే ప్రేక్షకులను నవ్వించింది. రాజశేఖర్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ కి కూడా మళ్లీ మరో పారితోషకం ఇచ్చారు. ఒక్క రాజశేఖర్ నటించేందుకు అంత భారీమొత్తం ఖర్చుపెట్టారు. తీరా సినిమా చూస్తే ఫ్లాపైంది. దీంతో నిర్మాతకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టమని తేలిపోయింది. రాజశేఖర్ కావాలంటూ వంశీ ఒత్తిడి చేయడంవల్లే అంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, లేదంటే చక్కగా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేదని, ఇప్పుడు అది కూడా కష్టమవుతోందని చిత్ర బృందం వాపోతోంది.












Click it and Unblock the Notifications