షూటింగ్ సెట్‌లో హఠాత్తుగా పడిపోయిన సమంత

అందం, నటన రెండూ కలిసిన కథానాయిక సమంత ప్రస్తుతం సిటీడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనెల ఏడోతేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మయోసైటిస్ చికిత్స తీసుకునేందుకు సినిమాలకు దూరం ప్రకటించిన తర్వాత ఏడాదిన్నరకు ఆమె నుంచి వచ్చిన సిరీస్ ఇది. వరుణ్ ధావన్ కథానాయకుడు కాగా, రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హాలీవుడ్ లో ప్రియాంకచోప్రా పోషించిన పాత్రను సమంత పోషించింది. యాక్షన్ సన్నివేశాల్లో సమంత నటన చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా ఈ సిరీస్ షూటింగ్ సమయంలో సమంత పడిన కష్టాలను హీరో వరుణ్ ధావన్ ఓ సందర్భంలో చెప్పారు.

హఠాత్తుగా పడిపోయేది
షూటింగ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా పడిపోయేదని, షాట్ గ్యాప్ వచ్చిన సమయంలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉండేదన్నారు. చాలా సందర్భాల్లో అలా స్పృహ తప్పి పడిపోయేదని, సెట్ లో ఉన్నవారంతా కంగారుపడిపోయేవారని, అయితే ఆమె నిబద్ధతకు కట్టుబడి, ఇచ్చిన మాటకు గౌరవంగా షూటింగ్ ను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పూర్తిచేసిందని వరుణ్ ధావన్ చెప్పారు. తన జీవితంలో ఈ తరహా అద్భుతమైన వ్యక్తిని ఇంతవరకు చూడలేదని, వృత్తిపై ఉన్న నిబద్ధత ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలిపిందని, మహిళలకే కాదని, ఈ తరం మహిళలందరికీ సమంత జీవితం చాలా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రస్తుతం వరుణ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

During the shooting of the Honey bunny web series Samantha suddenly fell ill due to illness

ఆచితూచి ఎంపిక చేసుకుంటా
హనీబన్నీ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో కూడా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే కూడా ఇవే మాటలు చెప్పారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో పడిపోయేదని, ఎంతో కష్టంతో, అనారోగ్యాన్ని జయించి షూటింగ్ లో పాల్గొందని, ఆమె కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిరీస్ విడుదలైన తర్వాత మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తం ఎపిసోడ్స్ లో కేవలం రెండు ఎపిసోడ్సే బాగున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను ఏ తరహా సినిమాలు చేయాలి? సిరీస్ లు చేయాలి? అనే విషయం దీంతో ఒక అవగాహన వచ్చిందని, ఇకనుంచి వాణిజ్య ప్రకటనల్లో కూడా ఉచితూచి కనిపిస్తానని, సినిమాలు, సిరీస్ లు ఆచితూచి ఎంపిక చేసుకుంటానని సమంత ప్రకటించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+