చిరంజీవికి భార్యగా, చెల్లెలుగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు...వెలుగుతున్నారు కూడా. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా చిరంజీవి నిలిచారు.ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత , చిరంజీవి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. విశ్వంభర సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే చిరంజీవి తన కెరీర్‌లో చాలామంది హీరోయిన్లతో నటించారు.

అయితే ఓ హీరోయిన్ మాత్రం చిరంజీవితో హీరోయిన్‌గా చెల్లెలుగా నటించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు నయనతార. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార స్టార్ హీరోలందరితోనూ నటించింది. నయనతార చిరంజీవితో రెండు సినిమాల్లో నటించారు. సైరా, గాడ్ ఫాదర్ సినిమాల్లో చిరంజీవి, నయనతార కలిసి నటించారు. సైరా సినిమాలో చిరంజీవికి భార్యగా నటించిన నయనతార, గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించారు. ఇలా నయనతార చిరంజీవి పక్కన రెండు విభిన్న పాత్రల్లో నటించి , మెప్పించారు.












Click it and Unblock the Notifications