ఓటీటీలోకి వణుకు పుట్టించే తెలుగు హారర్ మూవీ..!
తెలుగులో చిన్న సినిమాల హవా కొనసాగుతూనే ఉంది. సైలెంట్ గా వచ్చి హిట్ కొడుతున్న సినిమాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, శంబాల లాంటి సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాగే ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ మూవీ కూడా యువతను బాగా ఆకట్టుకుంటోంది. అయితే గతేడాది రిలీజైన చిన్న సినిమాల్లో ఒకటి "ఈషా".. తెలుగులో హారర్ మూవీస్ తక్కువే.. అలాంటి సమయంలో ఈ మూవీ ప్రేక్షకుల్ని వణికించింది అనే చెప్పాలి.
ఈషా మూవీ ప్రేక్షకుల్ని భయపెట్టడంలో సక్సెస్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. ఈషా మూవీ ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పణలో వచ్చింది. ఇక ఈ మూవీలో త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే సిరి హనుమంతు, పృథ్వీరాజ్, మైమ్ మధు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు.
ఈషా మూవీ మొత్తం సైన్స్, మూఢనమ్మకాలు, ఆత్మల చుట్టూ నడుస్తుంది. ఇక మూవీలో త్రిగుణ్, హెబ్బా పటేల్, మైమ్ మధుల నటన ఆకట్టుకుంటుంది. అలాగే హారర్ ఎలిమెంట్స్ బాగా పండాయి. థియేటర్లలో ఈషా మూవీ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ధృవన్ నేపథ్య సంగీతం భయపెడుతుంది. ఇక ఈ మూవీ ఐఎండీబీలో 9.3 రేటింగ్ దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇక ఈషా మూవీ దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం విదేశాల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications