RRRలో మెయిన్ హీరో ఎవరో చెప్పిన ఎలాన్ మస్క్!

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పుడు ఎంత సంచలనాన్ని కలిగించిందో మనందరికీ తెలుసు. ఈ చిత్రం విడుదలై మూడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. నెట్ ఫ్లిక్స్ లో రెండు సంవత్సరాల నుంచి టాప్10లో ఒకటిగా ఇప్పటికీ నిలుస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ప్రధానంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన తోడవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హీరోలిద్దరూ పోటీపడి నటించారు. ఈ సినిమాలో హీరోలిద్దరినీ సమానంగా చూపించానని, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని, ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఉందని రాజమౌళి అనేకసార్లు చెప్పారు.

అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా చెబుతోంది
అయినప్పటికీ తారక్ అభిమానులు తమ హీరోనే ప్రధాన హీరో అని, రామ్ చరణ్ అభిమానులు తమ హీరోనే ప్రధాన హీరో అంటూ సోషల్ మీడియాలో వాదులాడుకుంటుంటారు. ఈ విషయం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమే అని చెప్పొచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ ట్విటర్ (ఎక్స్) కు చెందిన ఏఐ బాట్ గ్రోక్ చెప్పింది. చాట్ జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ బాట్ గ్రోక్ ను తీసుకొచ్చారు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఇది తడుముకోకుండా సమాధానం చెబుతోంది.

Elon Musk X AI grok reveals who the main hero is in RRR

ఏఐ ఎన్టీఆర్ నే గుర్తించింది
ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రధానమైన హీరో అని, మల్లి అనే బాలికను రక్షించేందుకు అతని ప్రయాణం ప్రారంభమవుతుందని, అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించినప్పటికీ సినిమా పరంగా కథను ముందుకు నడిపించేది మాత్రం భీమ్ మాత్రమేనని చెప్పింది. దీంతో ఈ వార్త బయటకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

చివరకు ఏఐ కూడా జూనియర్ ఎన్టీఆర్ నే హీరోగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తను వైరల్ చేస్తున్నారు. కథలో కీలకమైన మలుపులకు రామ్ చరణ్ పాత్ర కీలకమని చెర్రీ అభిమానులు వాదిస్తున్నారు. హీరోలిద్దరూ సమానమైన పాత్రలు పోషించారంటూ రాజమౌళి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మూడు సంవత్సరాల నుంచి ఇద్దరు హీరోల మధ్య వివాదం మాత్రం చల్లారడంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+