అవకాశాలు కోసం ఇక్కడ పడుకోవాల్సిందే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా నటి ఎస్తెర్ సైతం కాస్టింగ్ గురించి చెప్పి షాకిచ్చింది.
నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు.ఎస్తర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బాదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

ఇక ప్రముఖ సింగర్ నోయెల్ సీన్ కొన్నాళ్లు ప్రేమయాణం సాగించిన ఈ భామ .. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే అభిప్రాయభేదాలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ గ్లామర్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా రెక్కి సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేర్‌కు అభిమానులుగా మారిపోయారు.ఈ మధ్య టెనెంట్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తన నటన, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఎస్తేర్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇప్పుడు దర్శకురాలిగా నిర్మాతగా మారింది ఎస్తేర్.ప్రస్తుతం హీరో ది వేకెంట్ హౌస్ అనే సినిమాను రూపొందిస్తుంది.
ఆ మధ్య ఆడవాళ్లకు కోరికులుంటాయని చెప్పి గట్టి షాకిచ్చింది. తాజాగా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఈ భామ స్పందించింది. ప్రతి రంగంలో మహిళలపై జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటివి చేయడానికి అవకాశాలు ఎక్కువ. దాన్ని మనం దూరం చేయలేం. అమ్మాయిలు అందంగా, ఎన్నో ఆశలతో, ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వస్తే కచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకునే మనుషులు ఉన్నారు. ఎవరూ దాని గురించి బలవంతపెట్టరు. కానీ ఆ అవకాశం అయితే ఉంది.
మరి మీకు ఆ పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నేను అలా చేయలేను, నా దారిలో నేను వెళ్తాను అంటే ఎవరూ బలవంతపెట్టరు. అలా కాకుండా నాకు తొందరగా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది ఏం చెప్పినా చేస్తాను అనుకునే వాళ్ళు కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందే. వారికి అదే షార్ట్ కట్ అని ఎస్తర్ తెలిపింది. అలాగే తమ తన టాలెంట్‌తోనే ఎదగాలని హార్డ్ వర్క్‌నే నమ్ముకునే వారు కూడా ఉంటారు. అయినా ఎవరి ఇష్టం వాళ్ళదని ఇక్కడ అది చేయ్ ఇది చేయ్ అని ఎవర్ని బలవంతం అయితే చేయరని ఈ హాట్ బ్యూటీ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications