ఈ సినిమాలు అట్టర్ ఫ్లాప్... కానీ థియేటర్లో 100 రోజులు ఆడాయి!

ఈరోజుల్లో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిందంటే వారంలోపే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. ప్రేక్షకులెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. అవసరమైతే ఓటీటీలో చూసుకుందాంలే అనుకుంటున్నారు. అలాంటిది ఇక సినిమా 100 రోజులు ఆడుతుంది అనేది చివరకు కలగా మిగిలిపోయింది. గతంలో మాత్రం సినిమాలు శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు.. ఇలా జరుపుకునేవి. థియేటర్లన్నీ ప్రజలతో కళకళలాడుతుండేవి. అటువంటిది ఇప్పుడు థియేటర్లకు ప్రజలు మాత్రం రావడంలేదు. కానీ చిత్రమైన విషయం ఏమిటంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ థియేటర్లలో మాత్రం 100 రోజులు ఆడాయి. అటువంటి సినిమాల గురించి తెలుసుకుందాం.

నెల్లూరు రామరాజులో 100 రోజులు
చిరంజీవి నటించిన అంజి సినిమా అప్పట్లో రూ.30 కోట్ల భారీ బడ్జెట్ తో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఏళ్ల తరబడి నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా విడుదలైన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయింది. దర్శకుడు కోడి రామకృష్ణ దీన్ని అద్భుతమైన విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. చిరంజీవికున్న స్టార్ డంతో కొన్ని థియేటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుంది. అలాగే మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చింది. ఎస్.జె.సూర్య ప్రతినాయక పాత్ర పోషించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే చిత్రంగా నెల్లూరు రామరాజు థియేటర్ లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.

Even though these films were total flops they still played for 100 days in theaters

9 కేంద్రాల్లో శతదినోత్సవం
అలాగే మహేష్ బాబు నటించిన మరో చిత్రం ఖలేజా. త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండోసారి నటించిన ఈ సినిమాలో ప్రిన్స్ కామెడీ ఎవరికీ ఎక్కలేదు. కానీ తర్వాత టీవీల్లో మాత్రం విపరీతంగా చూస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. చిత్రంగా ఈ సినిమా చిత్తూరు శ్రీనివాస థియేటర్ లో శతదినోత్సవాన్ని పూర్తిచేసుకుంది. పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ నటించిన మున్నా చిత్రంలో పాటలు ఇప్పటికీ క్లాసికల్ గా నిలిచాయి. ఆరోజుల్లో ఎందుకనో ప్రేక్షకులకు అనుకున్నంత స్థాయిలో, ప్రభాస్ స్థాయిలో సినిమా హిట్ కాలేదు. యావరేజ్ గా నిలిచింది. అయినప్పటికీ తొమ్మిది కేంద్రాల్లో ఈ సినిమా శతదినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+