స్మగ్లర్లు, దేశద్రోహులు హీరోలా?: వెంకయ్యనాయుడు

సినిమా అంటే కళ అని, అది కళాత్మకమైన వ్యాపారం అని, ప్రజలకు మేలు చేసేలా ఉండాలేకానీ వారిని చెడగొట్టేలా ఉండకూడదని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యానాయుడు వ్యాఖ్యానించారు. దేశద్రోహులు, స్మగ్లర్లు, తప్పుడు విధానాలు అవలంబించే క్యారెక్టర్లను హీరోలుగా చూపించడంవల్ల సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని వెంకయ్య ప్రశ్నించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అలనాటి గాయని, నటీమణి, నిర్మాత అయిన కృష్ణవేణి సంస్మరణార్థం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కథానాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పుడు విధానాలతో క్యారెక్టర్లు వద్దు
సినిమా అంటేనే ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం అని, కానీ నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ క్యారెక్టర్లతో ఉన్నవారిని హీరోలుగా చూపిస్తుంటే అందరూ ఆ తరహా విధానానికే అలవాటవుతారన్నారు. సినిమా అంటే మంచి విషయాన్ని తెలియజేయడం అన్నారు. పాత సినిమాల్లో కూడా ప్రతినాయకులు ఉండేవారని, సినిమా చివరలో మంచి విషయాన్ని తెలియజేయడంతోపాటు మంచి సందేశాన్ని ఇచ్చేవారన్నారు. తప్పుడు విధానాలతో రూపొందించే క్యారెక్టర్లను హీరోలు ఒప్పుకోకూడదని, వాటిని పిల్లలు అసలు చూడకూడదన్నారు. ప్రమాణాలు మంచిగా ఉంటే సమాజం కూడా అత్యున్నత ప్రమాణాలతో తయారవుతుందన్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి హీరోలు ఇప్పుడు రమ్మన్నా రారని తెలుసుకోవాలన్నారు.

ex vice president m venkaiah naidu comments on telugu movie heros characterization

ఈ తర ప్రేక్షకులు కూడా అవి గొప్పవని ఒప్పుకుంటున్నారు
'పాతాళభైరవి', 'మిస్సమ్మ', గుండమ్మ కథ, 'సీతారామయ్య గారి మనవరాలు'.. అలాగే ఉషాకిరణ్ మూవీస్ పై రామోజీరావు నిర్మించిన అనేక చిత్రాలు ప్రేక్షకులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేవని చెప్పారు. ఈ తరం ప్రేక్షకులు కూడా వాటిని గొప్ప చిత్రాలుగా చెప్పుకుంటున్నారంటే వాటి గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. అలాగే హాస్య సన్నివేశాల్లో కూడా ద్వంద్వార్థాలు లేకుండా, అశ్లీలత లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరితోపాటు మురళీమోహన్, నందమూరి రామకృష్ణ, అక్కినేని వెంకట్, అక్కినేని నాగసుశీల, ఎల్.వి.రమేష్ ప్రసాద్, కె.ఎస్.రామారావు, కైకాల నాగేశ్వరరావు తదితర ప్రముఖులంతా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+