హీరోయిన్ పూర్ణతో ఎఫైర్‌పై దర్శకుడు కామెంట్స్ వైరల్
దర్శకుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లరి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రవిబాబు ఆ తర్వాత లడ్డుబాబు, అవును, నువ్వులా వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవిబాబు నటుడుగా కూడా రాణించారు. పలు హిట్ సినిమాల్లో నటించారాయన. అయితే రవిబాబు పై గత కొంతకాలంగా ఓ రూమర్ వైరల్ అవుతోంది. ఆయన హీరోయిన్ పూర్ణ మధ్య ఎఫైర్ ఉందనే రూమర్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
దీనికి కారణం లేకపోలేదు. రవిబాబు తన సినిమాల్లో వరుసగా పూర్ణనే హీరోయిన్‌గా తీసుకున్నారు. లడ్డు బాబు, అవును, అవును 2 సినిమాల్లో పూర్ణనే హీరోయిన్‌గా తీసుకున్నారు రవిబాబు. దీంతో వీరి మధ్య ఏదో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై రవిబాబు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో దీనిపై స్పందించారు. నాకు పూర్ణకు మధ్య ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.

మీడియా వారు ఇలాంటి వార్తలను క్రియేట్ చేశారు తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు.ఇక ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు మేమిద్దరం కలిసి మూడు సినిమాలకు వరుసగా పనిచేయడంతోనే ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయని రవిబాబు చెప్పుకొచ్చారు.అయితే ఆ సినిమాలకు తాను పూర్ణనే తీసుకోవడానికి కారణం ఆ సినిమాలలోని పాత్రలకు పూర్ణ నూటికి నటి శాతం న్యాయం చేయగలదన్న నమ్మకంతోనే తనని సెలెక్ట్ చేసుకున్నామని ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications