Delhi Ganesh: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
ఎన్నో సినిమాల్లో అలరించిన ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ మృతి చెందారు. దీంతో తమిళ సినీ పరిశ్రమంలో విషాదం అలుకుముకుంది. ఢిల్లీ గణేష్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నమూశారు. ఆయన అనేక భాషాల్లో నటించారు. తమిళ్, తెలుగు, కన్నడ భాషాల్లో ఆయన చేశారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఆంక్షించారు.
గణేష్ పార్థిదేహాన్ని రామాపురంలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయనకు నివాళులు అర్పించడానికి సినీ ప్రముఖుల రానున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.ఢిల్లీ గణేష్ 1944 లో జన్మించారు. మంచి చదువులు చదివి 1964లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. 10 ఏళ్ల పాటు అంటే 1974 వరకు అక్కడే పని చేశారు. నటనపై ఆసక్తితో ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఢిల్లీ గణేష్ మొదటగా.. తమిళ, సీరియల్స్, సినిమాల్లో నటించారు. ఆయన 400 సినిమాల్లో నటించారు.

సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టక ముందు ఢిల్లీ గణేష్ ఢిల్లీకి చెందిన థియేటర్ ట్రూప్ లో నటించారు. అంతేకాదు దక్షిణ భారత నాటక సభ సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే గణేష్ నటన చూసిన కె. బాలచందర్ తన సినిమాలో అవకాశం ఇచ్చారు. 1976లో తన వచ్చిన పట్టిన ప్రవేశం సినిమాలో గణేష్ కు అవకాశం కల్పించారు. అక్కడి నుంచి ఆయన అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పేరు గణేష్ అనే ఉండేది. ఢిల్లీ థియేటర్ ట్రూప్ పని చేయడంతో కె. బాలచందర్ అతనికి ఢిల్లీ గణేష్ అని పేరు పెట్టారు.
అప్పటి నుంచి గణేష్ ను ఢిల్లీ గణేష్ అని పిలుస్తున్నారు. ఢిల్లీ గణేష్ మైఖేల్ మదన కామ రాజన్, ఆహా, అపూర్వ సగోధరార్గళ్, సింధు భైరవి , నాయకన్ , తెనాలి , ఎంగమ్మ మహారాణి వంటి హిట్ సినిమాల్లో నటించారు. వచ్చిన ఇండియన్ 2, కాంచన 3 లో కూడా చేశారు.












Click it and Unblock the Notifications