హీరోయిన్ షాక్..ఫొటో కోసమని వచ్చి అక్కడ టచ్ చేశాడేంటీ..!

సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడం లేదు. సోషల్ మీడియా వేదిగా కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటే.. మరికొందరు నేరుగానే ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారు. సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎంత సెక్యూరిటీ ఉన్న వారిని దాటుకుని వచ్చి మరీ తమ అభిమాన నటీ, నటులను కలవడానికి అభిమానులు ప్రయత్నిస్తుంటారు.

స్టార్స్ ఎలాంటి పరిస్థుతుల్లో ఉన్న వారితో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే దీనిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కొందరు ఆకతాయిలు హీరోయిన్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు మనం చాలానే చూశాం.

fan misbehave to heroine Prachi Desai at Airport

ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌ ఓపెనింగ్‌కు వచ్చిన హీరోయిన్ కాజల్ ఆగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాజల్ దగ్గరకు వెళ్లి తన నడుము పట్టుకుని ఫొటో దిగడానికి ఓ ఆకతాయి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన కాజల్ ఏం చేస్తున్నావ్ అంటూ అతనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన మరువక ముందే ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ దేశాయ్ ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు.

అభిమానులు కోరడంతో ప్రాచీ దేశాయ్ కొందరితో ఫొటోలు దిగింది. ఇదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సెల్ఫీ అడగడంతో కాదనలేక అతనితో ఫొటో దిగింది. ప్రాచీ దేశాయ్‌కు ఏదో బాగా తెలిసిన ఫ్రెండ్‌లా.. ఆమె భుజానికి డాష్‌ ఇచ్చి.. హత్తుకుని నిల్చుని మరీ ఫొటో దిగాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+