కాజల్ నడుముపై చేయి వేసిన ఆకతాయి.. తరువాత ఏం జరిగిందంటే..?
సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా వారిని దాటుకుని వచ్చి మరి తమ అభిమాన నటీ, నటులను కలవడానికి అభిమానులు ప్రయత్నిస్తుంటారు. స్టార్స్ ఎలాంటి పరిస్థుతుల్లో ఉన్నా వారితో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే దీనిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొందరు హీరోయిన్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు అతిథిగా హాజరైంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్ కలర్‌ఫుల్‌గా రెడీ రావడం జరిగింది.

రెడ్ కలర్ శారీలో హాజరై అక్కడున్నవారందరినీ ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. అయితే ఈ క్రమంలో ఓ ఆకతాయి తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. సడన్‌గ కాజల్ దగ్గరకు వెళ్లి తన నడుము పట్టుకుని ఫొటో దిగడానికి ఆకతాయి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తం అయిన కాజల్ ఏం చేస్తున్నావ్ అంటూ అతనిపై అసహనం వ్యక్తం చేసింది. కాజల్ స్థానంలో వేరే ఎవరున్నా వెంటనే అతని చెంప చెల్లుమనిపించేవారు.
Orey 😳😳😳😳😳
— GetsCinema (@GetsCinema) March 6, 2024
https://t.co/XQ7yRcUGDX
కానీ అంత జరిగిన కూడా ప్రశాంతంగా ఉన్న కాజల్ తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు కాజల్ అగర్వాల్‌కు కొత్తేం కాదు. గతంలో కూడా కాజల్ ఇలాంటి చేదు అనుభవాలను చాలానే ఫేస్ చేసింది. ఇంకా చెప్పాలంటే కాజల్‌కు జరిగినన్ని ఘటనలు మరే హీరోయిన్‌కు జరగలేదంటే అతిశేయోక్తి కాదేమో అనిపిస్తోంది. ప్రస్తుతం కాజల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications