రక్తంతో ఎన్టీఆర్ కటౌట్‌కు అభిషేకం (వీడియో)
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నతరుణం రానే వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం 'దేవర'.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందనే చెప్పాలి. ట్రైలర్‌ను చూస్తుంటే సముద్రం చూట్టు జరిగే కథగా అర్థం అవుతోంది. తండ్రి , కోడులుగా ఎన్టీఆర్ కనిపించనున్నారు.
ఇక RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన 'దేవర' చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సింగిల్‌గా నటిస్తోన్న సినిమా కావడంతో అభిమానులు ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకు ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం క్యాన్సిల్ అయిందంటే వాళ్లు ఎంత రచ్చ చేశారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

అనంతపురంలోని ఒక థియేటర్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హంగామా తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఏకంగా 50 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేసిన ఫ్యాన్స్, ఆ కటౌట్ కి రక్తాభిషేకం, పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ సైతం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో.. మొదటి రోజు ఈ సినిమా రూ.50 నుంచి రూ 100 కోట్ల మధ్య కలెక్ట్ చేస్తోందని ట్రెడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Blood Bath At Ananthapur @tarak9999 🔥🔥🔥. @DevaraMovie #Devara pic.twitter.com/fN45i29lt7
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) September 20, 2024
ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. కథలో ఆయన నిడివి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లో జాన్వీ కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునే ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర, మొదటి పార్ట్‌ను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతున్నారు. 'ఆచార్య' వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ''ఎందుకు పుట్టిందో'' సాంగ్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ సాంగ్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications