గేమ్ ఛేంజర్ ఎక్కడో తేడా కొడుతుందే..!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' టీజర్ శనివారం విడుదలైంది. 1:30 సెకన్ల నిడివి గల టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీజర్‌ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మూడు రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించారు.శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
రామ్ చరణ్ మాస్ అవతారంలో ఇరగదీశాడనే చెప్పాలి. సినిమాలో మెయిన్ విలన్‌గా ఎస్‌జె సూర్య కనిపించబోతున్నారు. ఇక తమన్ అందించిన బీజీఎమ్ ఆకట్టుకుంది. అయితే టీజర్‌పై కొంతమంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.టీజర్ బాగుందా? బాగాలేదా అనే కన్ ఫ్యూజన్‌లో అభిమానులు ఉండిపోయారు.ఏదో చెప్పబోయి, ఇంకేదో జరిగినట్టుగా టీజర్ మారిపోయింది. శంకర్ సినిమాలంటేనే విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటాయి. గ్రాండియర్‌గా ఉంటాయి. ఇందులో ప్రతి ఫ్రేము అలానే కనిపిస్తుంది.

ఓ కమర్షియల్ సినిమాని ఇంతటి గ్రాండియర్‌గా చూపించడం మామూలు కాదు. కానీ కథ పరంగానే, ఆడియెన్స్‌లో, ఫ్యాన్స్‌లో హైప్ ఇచ్చే విషయంలోనే డౌట్ కొడుతుంది. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. టీజర్ ఏమాత్రం కిక్ ఇచ్చేలా లేదంటున్నారు. భారీ అంచనాలున్న నేపథ్యంలో ఆ అంచనాలు అందుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జస్ట్ యావరేజ్, బిలో యావరేజ్ టీజర్‌గా చెబుతున్నారు. శంకర్ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన తీసిన భారతీయుడు 2 డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందనే డౌట్ మెగా అభిమానుల్లో ఉంది.
మరి నిజంగానే గేమ్ ఛేంజర్‌లో కంటెంట్ ఉందా? లేక హడావుడినే మిగిలిపోతుందా ? అనేది చూడాలి.కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫెయిల్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications