అల్లు అర్జున్ - రామ్ చరణ్ లో ఎవరు గొప్ప?
మెగా కుటుంబం నుంచి చిరంజీవి వారసులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. అలాగే రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ దూరం జరిగారని, అందుకు కారణం ఏమిటనే విషయం బయటకు రావాల్సి ఉందంటున్నారు.
తాజాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో అవలేదని, అందులో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందంటున్నారు. అందువల్లే దీని బిజినెస్ బాగా జరిగిందని, అంతేకానీ అందులో చెర్రీ పాత్ర పెద్దగా ఏమీలేదంటున్నారు.

పుష్ప 2పై క్రేజ్ భారీగా ఉంది. హిందీ బెల్టులో ఈ సినిమాపై తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతున్న పుష్ప2 బిజినెస్ భారీస్థాయిలో జరుగుతోంది. అందుకు అల్లు అర్జున్ క్రేజ్ ముఖ్యం అని బన్నీ అభిమానులు అంటున్నారు. అయితే సినిమా బాగా రావడానికి దర్శకుడు సుకుమార్ కారకుడని, ప్రత్యేకంగా బన్నీ పాత్ర ఏంలేదని రామ్ చరణ్ అభిమానులు అంటున్నారు.
బన్నీకి, చెర్రీకి పడటంలేదంటున్నారుకానీ వాస్తవానికి వీరిద్దరూ ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వెళుతున్నారు. సందర్భాలు ఎదురైనప్పుడు, వేడుకలప్పుడు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరూ కలిసిన సందర్భం కూడాలేదు.












Click it and Unblock the Notifications