కంట్రోల్ అవ్వడం కష్టమే.. గ్లామర్ డోస్ పెంచేసిన "చిట్టి"
'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది "ఫరియా అబ్దుల్లా". ఆ మూవీలోని తన ప్రత్యేకమైన హైట్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఫరియా తెలుగులో చివరిగా 'మత్తు వదలరా 2' సినిమాలో నటించి మెప్పించింది. ఆ మూవీలో తన నటనకు గాను రీసెంట్ గానే 'గద్దర్ ఫిల్మ్ అవార్డు' సైతం గెలుచుకుంది. అలాగే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో ఓ సాంగ్‌లో కూడా కనిపించి ఆకట్టుకుంది.

ఇలాగే నిద్రలేవాలని అనిపిస్తుంది...
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఫరియా "ఇలాగే నిద్రలేవాలని నాకు అనిపిస్తుంది... కానీ ఈ లుక్ సాధ్యం కాదని తెలుసు కదా... హిహి" అనే క్యాప్షన్‌తో వైట్ కలర్ ఫ్లోరల్ స్కర్ట్‌లో హాట్ ఫొటోలు షేర్ చేసింది. రాశీ ఖన్నా కూడా ఈ ఫోటోలకు 'బ్యూటీ' అని కామెంట్ చేసింది.
కొందరు నెటిజన్లు "ఏంటి చిట్టీ ఇలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావ్?" అంటూ ఫన్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు స్క్రీన్‌పై మాత్రమే కాకుండా డ్యాన్స్‌లోనూ ఫరియా టాలెంట్ చూపించింది. ముఖ్యంగా బెల్లీ డ్యాన్స్‌లో ఇరగదీసే స్థాయిలో ఉన్న ఈ బ్యూటీ, ఆహా ఓటీటీలో ప్రసారమైన 'డ్యాన్స్ ఐకాన్ 2'కి జడ్జిగా వ్యవహరించింది. ఈ షోలో ఆమె వేసిన స్టెప్పులు చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె ఒక తమిళ చిత్రంలో నటిస్తుండగా, తెలుగులో 'గుర్రం పాపిరెడ్డి' సినిమాలో కూడా కనిపించనుంది.












Click it and Unblock the Notifications