తమన్నాను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్?
సినీ పరిశ్రమలోకి వచ్చి 19 సంవత్సరాలు పూర్తిచేసుకుంది తమన్నా భాటియా. స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే వెబ్ సిరీస్ లతో కూడా అలరిస్తోంది. ప్రస్తుతం కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. కోలీవుడ్ పరిశ్రమలో యాంగ్రీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఓ దర్శకుడు తమన్నాను లాగిపెట్టి కొట్టాడు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.
సినిమా షూటింగ్ జరిగే సమయంలో డైరెక్టర్ అడిగిన హావభావాలు ఇవ్వకపోవడం.. అంతేకాకుండా సీన్ కోసం ఎక్కువ టేక్స్ తీసుకోవడంతోపాటు దర్శకుడిని బాగా విసిగించింది. దీంతో తారస్థాయికి చేరుకున్న కోపంతో ఆ డైరెక్టర్ లాగిపెట్టి కొట్టాడు. షూటింగ్ లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. అయితే తమన్నా మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంది. కారణం.. ఆ డైరెక్టర్ ఆమెకు మంచి స్నేహితుడే. తర్వాత మాత్రం అతడి సినిమాలు చేయలేదంట. అతణ్ని దూరంగా పెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఈ వార్త తీవ్రమైన వైరల్ గా మారింది.

విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న తమన్నా త్వరలోనే అతన్ని పెళ్లిచేసుకోబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెప్పబోతోందంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న ఫొటో షూట్లు చూస్తే అందరికీ మతిపోతోంది. మత్తెక్కించేలా, కవ్వించే స్టిల్స్ తో వీటిని చూసిన కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే చివరిగా 'బంద్రా' అనే మలయాళ సినిమాతో అలరించింది. జైలర్ లో తను చేసిన పాట మంచి పాపులర్ అయింది. ఇప్పటికీ తన కెరీర్ ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వేధిస్తోంది. అటువంటివారికి తమన్నా ప్రత్యామ్నాయంగా కనపడుతోంది.












Click it and Unblock the Notifications