అన్నా.. నిన్ను ఆ సినిమా నుంచి తీసేశారు.. నీకు అర్థం అవుతోందా..?
ఇండస్ట్రీలో ఉండాలంటే హిట్ పడాల్సిందే. హిట్ కొట్టిన వారికే ఇక్కడ ఆఫర్లైనా, మర్యాదైనా. ఒకటి, రెండు ఫ్లాపులు పడితే.. ఒప్పుకున్న సినిమాలు కూడా చేజారిపోతుంటాయి. అది ఎంతటి స్టార్ హీరో అయినా సరే. ఫ్లాపులు వస్తే.. ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా తప్పిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఓ హీరో జీవితంలో చోటు చేసుకుంది. ఆ హీరో మరెవరో కాదు..నితిన్. తాజాగా నితిన్ ఓ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ సినిమా ఏంటో తెలియాలంటే .. ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత దిల్ అంటూ వెంటనే బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీల్లో నితిన్ ఓ రేంజ్‌కు వెళ్లతాడని అంతా భావించారు. అయితే వరుస ఫ్లాపులతో టాప్ రేసు నుంచి నితిన్ వెనక్కి తగ్గాడు. నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది నితిన్ కెరీర్ మారిపోయింది.

'భీష్మ' తరువాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ చివరి ఐదు సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ,మాచర్ల నియోజకవర్గం, రాబిన్ హుడ్, సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యాయి. తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కడుములని నమ్ముకున్న వర్క్ అవుట్ కాలేదు.
'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. రాబిన్ హుడ్ పరిస్థితి కూడా అంతే. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నితిన్ తాజాగా నటించిన చిత్రం 'తమ్ముడు'. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్ మీద తెరకెక్కిన ఈ సినిమా సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే నితిన్ సినిమాలను జనాలు చూడటం మానేశారేమో అనిపిస్తోంది. దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. ఈ సినిమా కలెక్షన్లు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.
గతంలో నితిన్ ఒప్పుకున్న సినిమా నుంచి ఆయన్ను తప్పించారు. 'బలగం' ఫేం వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' సినిమాలో నితిన్‌ను హీరోగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు సైతం ప్రకటించారు. అయితే నితిన్ వరుస ఫ్లాపులతో ఉండటంతో ఈ సినిమా నుంచి నితిన్‌ను తప్పించారనే ప్రచారం జరుగుతోంది. నితిన్ స్థానంలో శర్వానంద్‌ను తీసుకున్నారనే సమాచారం అందుతోంది. ఒకవేళ శర్వానంద్‌తో కుదరకపోతే.. తమిళ హీరో కోసం కూడా ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నితిన్ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కెరీర్ విషయంలో నితిన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.












Click it and Unblock the Notifications