మహేష్‌బాబుపై తొలి క్లాప్ అతనే... బాగా కలిసివచ్చి సూపర్ స్టార్ అయ్యాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు సినిమా 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 1999 ఆగస్టు30వ తేదీన విడుదల కాగా జులై 30 2024కు సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేశంలో అందమైన నటుడు ఎవరని అడిగితే అందరూ ఠక్కున చెప్పే పేరు మహేష్ బాబు. ఒక అబ్బాయిని ఎవరితోనైనా పోల్చి చెప్పాలన్నా అబ్బా.. అచ్చం మహేష్ బాబులా ఉన్నావు అంటారు. ఒక్క తెలుగు సినీ పరిశ్రమే కాదు.. భారతదేశ సినీ పరిశ్రమల్లోనే అత్యంత అందమైన, అరుదైన నటుడు ప్రిన్స్. అటువంటి ప్రిన్స్ కు రోజురోజుకు అందం పెరుగుతుందేకానీ ఏమాత్రం తగ్గడంలేదు.

యమలీల ఆలస్యం కావడంతో..
మహేష్ బాబును సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని సూపర్ స్టార్ కృష్ణ మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికి మంచి ఫాంలో ఉన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల కథను చెప్పారు. అది బాగా నచ్చడంతో వెంటనే చేద్దామని కృష్ణ అన్నారుకానీ కొన్ని కారణాలవల్ల అది ఆలస్యమైంది. పరుచూరి బ్రదర్స్ రాజకుమారుడ కథతో కృష్ణ దగ్గరకు వెళ్లగా అది ఆయనకు బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా బాధ్యతను రాఘవేంద్రరావుకు అప్పగించారు. వాస్తవానికి పద్మాలయ బ్యానర్ పై ఎన్నో సినిమాలు నిర్మించిన కృష్ణ.. తన వారసుడు నటించే తొలి చిత్రాన్ని నిర్మించే అవకాశం మాత్రం అశ్వనీదత్ కు అప్పగించారు.

For the first time ap cm Chandrababu clop Mahesh Babu who is acting in the movie Rajkumarudu

తొలిసారిగా పరిచయం.. ప్రీతిజింటా
ప్రీతిజింటా కథానాయికగా తొలిసారి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. రాజకుమారుడు విడుదలై ఘనవిజయం సాధించడంతోపాటు 44 కేంద్రాల్లో 100 రోజులు పూర్తిచేసుకొని శతదినోత్సవం జరుపుకుంది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ఎంతో కలిసివచ్చింది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి మహేష్ బాబుపై తొలిసారిగా క్లాప్ కొట్టింది ఎవరో కాదు.. అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు. ఆయన చేయి ప్రిన్స్ కు బాగా కలిసివచ్చిందని, సూపర్ స్టార్ అయ్యాడని, ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ హీరో అవుతున్నాడంటూ నెటిజన్లు, మహేష్ బాబు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+