విశ్వక్ సేన్ సినిమాకు నిర్మాతగా బీఆర్ఎస్ మాజీ మంత్రి తనయుడు..?

యంగ్ హీరో విశ్వక్ సేన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో వెండితెరకు పరిచయమైన విశ్వక్.. ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత హిట్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం, దాస్ కా దమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా పలు సినిమాలతో ప్రేక్షకుల్లో మాస్ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకోగలిగాడు.

ఇక విశ్వ‌క్ గత చిత్రం " లైలా " భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీలో మొదటిసారి విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించినా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాడు. సినిమాలో శృతి మించిన అశ్లీలత, 18+ డైలాగ్స్, వల్గారిటీ ఎక్కువగా ఉన్నాయని విపరీతంగా ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం 30 ఇయర్స్ పృధ్వీ పలు వ్యాఖ్యలు చేయడంతో సినిమాని బ్యాన్ చేయాలంటూ పెద్దఎత్తున ట్వీట్స్ చేశారు. దాంతో వివాదాలు వద్దు అని.. క్షమించాలని మీడియా ఎదుట విశ్వక్ సారీ కూడా చెప్పారు. ఇక సినిమా విడుదల తర్వాత ఇకపై చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటానని నోట్ కూడా రిలీజ్ చేశారు.

former-brs-ministers-son-to-produce-vishwak-sens-film

ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ యంగ్ హీరో.. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఉన్నట్టు కనిపిస్తోంది. జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ తో ఫంకీ అనే చేస్తున్నాడు. సితార ఎంటెర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ సినిమాతో పాటు మరి కొన్ని కథలు వింటున్న విశ్వక్ సేన్ మరో సినిమాను కూడా లాక్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ చిత్రానికి కల్ట్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్టు సమాచారం.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఏ వివరాలు ఇంకా తెలియకపోయినప్పటికీ.. నిర్మాత గురించి అయితే లీక్ వచ్చింది. ఆ సినిమాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి తనయుడు ప్రొడ్యూస్ చేయబోతున్నారని అంటున్నారు. గతంలో తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి.. మూవీ ప్రొడక్షన్ లోకి రాబోతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే కల్ట్ సినిమాను నిర్మించబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+