రీ ఎంట్రీకి రెడీ అయిన మాజీ కేంద్ర మంత్రి..!

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దేశ ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి. ముందుగా మోడలింగ్‌లో రాణించిన స్మృతి.. ఆపై టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత స్మృతి ఇరానీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్‌తో ఉన్న అనుబంధం ఆమెను బీజేపీ పట్ల ఆకర్షితురాలిని చేసింది. 2003లో బీజేపీలో చేరిన ఆమె.. 2004 సార్వత్రిక ఎన్నికల్లో తన అదృష్టాన్ని తొలిసారి పరీక్షించుకున్నారు. కానీ ఓటమి పాలయ్యారు. దాదాపు 15 ఏళ్ల పాటు విజయం ఆమెను ఊరించగా.. చివరకు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అమేథీలో ఓడించి.. మోడీ 2.o క్యాబినెట్‌లో మహిళా- శిశు అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఇక గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు స్మృతి ఇరానీ. అయితే రాజకీయాల్లో కాస్త సైలెంట్ గానే ఉంటున్న ఆమె ఇప్పుడు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తోంది. పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నటనకు దూరంగా ఉంటున్నారు స్మృతి ఇరానీ. అయితే ఇప్పుడు త్వరలోనే ఆమె ఒక సిరీస్‌ కోసం పని చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నటిగా ఉన్నప్పుడు ఏక్తా కపూర్‌ రూపొందించిన 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ' అనే సీరియల్‌ ఆమెకు నటిగా ఎంతో గుర్తింపు తెచ్చింది. 2000 - 2008 వరకూ ఈ సీరియల్ విజయవంతంగా కొనసాగింది. తులసి అనే గృహిణి పాత్రలో ఆమె ఒదిగిపోయి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

former-union-minister-ready-for-re-entry-as-actress

ఇప్పుడు ఆ సీరియల్‌ను సిరీస్‌గా సిద్ధం చేయాలని ఏక్తా కపూర్‌ భావిస్తున్నారట. అందుకే ఎక్కువ ఎపిసోడ్స్‌ లాగా కాకుండా లిమిటెడ్ ఎపిసోడ్స్‌తో మరోసారి ప్రేక్షకులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారని బీ టౌన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏక్తా కపూర్‌ కోరిక మేరకు మరోసారి కెమెరా ముందుకు వచ్చేందుకు స్మృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

మరోవైపు స్మృతి ఇరానీ తెలుగులో కూడా జై భోలో తెలంగాణ అనే సినిమాలో నటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ సినిమా విడుదల అయ్యింది. అందుకే తెలంగాణ వాసులకు కూడా ఆ సినిమాలో నటించిన కారణంగా స్మృతి ఇరానీపై అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+