ఫ్రెండ్ షిప్ డే స్పెషల్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..?

స్నేహం అనే పదం చిన్నది అయినా దాని వెనక ఉన్న భావాలు మాత్రం మాటల్లో చెప్పలేం. ఒక నిజమైన మిత్రుడు మన జీవితాన్ని మార్చగలడు. ఫ్యామిలీ తర్వాత మన జీవితంలో మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరంటే ఫ్రెండ్ అనే చెప్పాలి. వయసుతో, ఆస్తితో సంబంధం లేకుండా ఉండే రిలేషన్ అంటే అది ఫ్రెండ్‌షిప్ మాత్రమే. స్నేహానికి నిర్వచనం లేదు కానీ.. సంతోషం వచ్చినప్పుడు మనతో నవ్వే వ్యక్తి, విషాదంలో మనతో కూర్చొని మన బాధను పంచుకునే వ్యక్తి మాత్రమే నిజమైన స్నేహితుడు. కాలం మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, కానీ ఒక మంచి ఫ్రెండ్‌తో ఉన్న అనుబంధం కాలాన్ని తట్టుకుని నిలబడుతుంది. ఈ తరహా స్నేహం సినీ పరిశ్రమలోని వారి మధ్య కూడా ఉండడం సహజమే.

సినిమా ప్రపంచం అనేది బయటకు చాలా గ్లామరస్‌గా కనిపించవచ్చు. కానీ ఈ రంగంలో హీరోలు, హీరోయిన్లు స్క్రీన్‌పై పోటీపడుతూ కనిపించవచ్చు. కానీ స్క్రీన్ వెనక వారు ఒకరికి ఒకరు మానసికంగా, వ్యక్తిగతంగా ఎంతో మద్దతుగా నిలుస్తారు. ఒకరికొకరు సపోర్ట్ చేయడం, అవసరమైన సమయంలో పక్కన నిలవడం నిజమైన స్నేహానికి నిదర్శనం. ఫ్రెండ్‌షిప్ అనేది ఏ రంగానికైనా అవసరం కూడా.. అందుకే ఈ స్పెషల్ డే సందర్భంగా సినీ ప్రముఖుల స్నేహ బంధాల గురించి మీకోసం ప్రత్యేకంగా..

friendshi-between-heros-and-heroins-list-from-tollywood

హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరంటే..

చిరంజీవి - నాగార్జున..

సినిమాలలో కలిసి నటించకపోయినా, చిరంజీవి - నాగార్జునల మధ్య ఉన్న సంబంధం ప్రత్యేకం. బిజినెస్ విషయాల్లోనూ, వ్యక్తిగత జీవితాల్లోనూ ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేస్తూ ఉంటారు.

మోహన్ బాబు - రజనీకాంత్..

టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య స్నేహబంధానికి చక్కటి ఉదాహరణ మోహన్ బాబు - రజనీకాంత్. వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించారు. వ్యక్తిగతంగా కూడా ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు.

మహేష్ బాబు - రామ్ చరణ్ - ఎన్టీఆర్..

వయసులో తేడా ఉన్నా.. వీరి ముగ్గురి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. తరచూ కుటుంబాలతో కలిసి పార్టీలు, గెట్టు గెదరింగ్స్ చేసుకుంటూ తమ స్నేహాన్ని చూపిస్తున్నారు. షూటింగ్ లొకేషన్లకి కూడా ఒకరిని చూసుకోవడంలో ముందుంటారు.

రానా - రామ్ చరణ్..

రానా దగ్గుబాటి - రామ్ చరణ్ ల స్నేహం స్కూల్ డేస్ నుంచే ప్రారంభమైంది. ఒకరి ప్లేట్ లో ఒకరు తినేంత బంధం ఉన్న వీరు, కెరీర్ లో బిజీగా ఉన్నా కలిసే సమయంలో కలుసుకొని ముచ్చట్లు పెట్టుకుంటారు.

ప్రభాస్ - గోపీచంద్..

ఇటీవల 'అన్‌స్టాపబుల్' షోలో కలిసి కనిపించిన ప్రభాస్ - గోపీచంద్, రెగ్యులర్‌గా టచ్‌లో ఉండే బెస్ట్ ఫ్రెండ్స్. గోపీచంద్ ను హీరోగా నిలబెట్టేందుకు ప్రభాస్ తన వంతు సహాయం చేసినట్టు సమాచారం.

నితిన్ - అఖిల్..

నితిన్ - అఖిల్ మధ్య ఉన్న స్నేహం ఇండస్ట్రీకి రాకముందే మొదలైంది. నితిన్ తన సొంత బ్యానర్ లో అఖిల్ ని లాంచ్ చేసి తన బాంధవ్యాన్ని నిరూపించాడు. వీరిద్దరూ బయట కలిసి కనిపించకపోయినా, వారి మధ్య బంధం పటిష్ఠంగా ఉంది.

ఇంకా ఉన్న హీరోల స్నేహబంధాలు:

  • ఎన్టీఆర్ - అల్లు అర్జున్
  • రామ్ చరణ్ - ఎన్టీఆర్
  • మహేష్ బాబు - సుమంత్
  • రామ్ చరణ్ - శర్వానంద్
  • ప్రభాస్ - రానా
  • అల్లరి నరేష్ - నాని
  • మంచు మనోజ్ - సాయి ధరమ్ తేజ్
  • విజయ్ దేవరకొండ - నవీన్ పోలిశెట్టి
  • వరుణ్ తేజ్ - నితిన్
  • బెల్లంకొండ శ్రీనివాస్ - నాగశౌర్య

హీరోయిన్స్ లో స్నేహితులు వీళ్లే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్స్ గురించి ఎక్కువగా వినిపించకపోయినా కొన్ని నిజమైన స్నేహాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

త్రిష - ఛార్మీ..

త్రిష - ఛార్మీల మధ్య ఉన్న స్నేహం ఇండస్ట్రీకి రాకముందే మొదలైంది. వీరిద్దరూ కలిసే సందర్భాల్లో ఆ రచ్చ, ఆ ఎంజాయ్ అంతా ప్రత్యేకమే.

తమన్నా - శృతిహాసన్..

శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో "అబ్బాయి అయితే తమన్నాను పెళ్లి చేసేవాణ్ని" అన్న మాటలతో వారి ఫ్రెండ్‌షిప్ డెప్త్ అర్థమవుతుంది. వ్యక్తిగత రోజుల్లో ఒకరినొకరు తప్పకుండా విష్ చేస్తూ ఉంటారు.

తమన్నా - కాజల్ అగర్వాల్..

సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇద్దరూ కలిసి ముందుకు వెళ్లే మంచి ఫ్రెండ్స్. ఒకరి నిర్ణయాలపై మరొకరి సలహా తీసుకోవడం వీరి మధ్య ఉన్న సహకారాన్ని చూపిస్తుంది.

రాశీ ఖన్నా - వాణి కపూర్..

రాశీ ఖన్నా, వాణి కపూర్ మధ్య చాలా బలమైన అనుబంధం ఉంది. ఒక ఇంటర్వ్యూలో వాణి కపూర్ తనకు ఎంతో ఇష్టమని రాశీ చెప్పిన మాటలు ఈ బాంధవ్యాన్ని చాటుతాయి.

కీర్తి సురేష్ - కళ్యాణి ప్రియదర్శన్..

కీర్తి, కళ్యాణి ఇద్దరూ సినీ కుటుంబాల నుండి వచ్చినవారే. తల్లుల పరిచయం నుంచే వీరి స్నేహం ప్రారంభమైంది. ఇప్పటికీ ఇద్దరూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు.

ఇంకా ఉన్న బెస్ట్ ఫ్రెండ్ జోడీలు..

  • కీర్తి సురేష్ - సమంత
  • అంజలి - భాను
  • మంచు లక్ష్మి - రకుల్ ప్రీత్ సింగ్ - ప్రగ్యా జైస్వాల్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+