సినిమా హీరో నుంచి సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా మహేష్ బాబు!
తెలుగు సినీ పరిశ్రమలోని సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న మహేష్ బాబు బిజినెస్‌మెన్‌గా అవతరిస్తున్నారు. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ సునీల్ తో కలిసి AMB బ్రాండ్‌ను క్రియేట్ చేశారు. ఈ బ్రాండ్ పేరుపై హైదరాబాద్, బెంగళూరులో మల్టీప్లెక్స్ లు నిర్మించారు. ఇతర నగరాలకు కూడా మల్టీప్లెక్స్ ల వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు కొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెడుతున్నారు.
మహేష్ బాబుకు ఇప్పటికే హైదరాబాద్ గచ్చిబౌలిలో AMB సినిమాస్ ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో AMB క్లాసిక్ నిర్మాణంలో ఉంది. దీంతోపాటు హకీంపేట్‌లో కొత్త థియేటర్ నిర్మాణం జరుగుతోంది. హకీంపేటలో ఐమాక్స్ స్క్రీన్ పెట్టబోతున్నారు. ఇవి 2027లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వరకే పరిమితం కాకుండా ప్రిన్స్ తన ప్రణాళికలను ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో కూడా అమలు చేయనున్నారు.

బెంగళూరులో నిర్మిస్తున్న ప్రాజెక్టు పూర్తికావొచ్చింది. కపాలి థియేటర్ ప్రాంగణంలో ఏఎంబీ సినిమాస్ కపాలి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సినిమాగా దీన్ని తీర్చిదిద్దారు. మెట్రో నగరాల తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్ నగరాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌తో కలిసి ఏఎంబీ సినిమాస్ ను లగ్జరీ బ్రాండ్‌గా రూపొందించారు. 7 స్టార్ లగ్జరీ, 7 3D స్క్రీన్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో గోవా, చెన్నై వంటి నగరాల్లో కూడా మల్టీప్లెక్స్ లు నిర్మించబోతున్నారు. కొత్తగా నిర్మించే మల్టీప్లెక్స్ ల్లో డాల్బీ అట్మాస్, IMAX వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని తీసుకువస్తున్నారు.
మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అతన్ని అనుసరిస్తూ అల్లు అర్జున్, రవితేజ, నాని లాంటివారు ప్రయాణిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో ఓ మంచి థియేటర్ ను నిర్మించారు. సినిమా రంగంలో ఉండటంతో వీరికి ఆ సినిమాలకు సంబంధించిన వ్యాపారాలే తెలుసు కాబట్టి అందులోనే పెట్టుబడి పెడుతున్నారు. నాగార్జున లాంటివారు మాత్రం భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లాంటివి చేస్తారు. ఒకరకంగా ఆయన వ్యాపారంలో మాస్టర్ మైండ్. పెట్టిన రూపాయికి ఐదు రూపాయలు లాభ తీసుకురాగలిగినవారు. ఏది ఏమైనప్పటికీ మన తెలుగు హీరోలంతా మల్టీప్లెక్స్ వ్యాపారాల్లోకి ప్రవేశించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన కారకుడు కావడంతో ఆయన అభిమానులంతా గర్వంగా కాలర్ ఎగరవేస్తున్నారు.












Click it and Unblock the Notifications