ఎటువంటి బూతులు లేకుండా సహజమైన కామెడీతో మనసారా నవ్వించిన సినిమా
తెలుగు సినీ పరిశ్రమలో పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, తన అద్భుతమైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతున్న యువ నటుడు తిరువీర్. కేవలం సహాయ పాత్రలకే పరిమితం కాకుండా, హీరోగా కూడా తన సత్తా చాటుతూ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు.
తిరువీర్ ప్రయాణం 2016లో 'బొమ్మల రామారం' సినిమాతో మొదలైనా, నటుడిగా ఆయనకు అసలు గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం 'జార్జ్ రెడ్డి' (లలన్ సింగ్ పాత్ర) , 'పలాస 1978' (రంగారావు పాత్ర) చిత్రాలు. ఈ పాత్రల్లో ఆయన చూపించిన తీవ్రత, సహజత్వం అగ్ర దర్శకులు, నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. 'సిన్' వెబ్ సిరీస్, నాని 'టక్ జగదీష్' వంటి ప్రాజెక్టుల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

2022లో వచ్చిన హారర్ థ్రిల్లర్ 'మసూద'తో తిరువీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో, తెలుగు ఇండస్ట్రీలో తిరువీర్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 'పరేషాన్' సినిమాలో తనదైన మార్కు నటనతో మంచి మార్కులు కొట్టేయడమే కాక, 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించారు.
తాజాగా, నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో తిరువీర్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.ఈ చిత్రంలో తిరువీర్ కామెడీ టైమింగ్ అద్భుతంగా పండింది. థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు.ఆయన చూపించిన న్యాచురల్ నటన, పాత్రలో లీనమైన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ముఖ్యంగా, ఒక కీలక సన్నివేశంలో నాలుగు వేరియేషన్స్ చూపిస్తూ తిరువీర్ చేసిన పర్ఫార్మెన్స్ చూసి విమర్శకులు సైతం ప్రశంసించారు.'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విజయంతో, తిరువీర్ ఇప్పుడు యూనివర్సల్ యాక్టర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. భవిష్యత్తులో ఆయన తప్పకుండా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని, తెలుగు సినిమాకు ఒక గొప్ప నటుడు దొరికాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications