ఉగాది నుంచి గద్దర్ అవార్డుల ప్రదానం
ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలుగుభాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి.. ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు.
జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్య, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువులతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవార్డులు అందజేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

అవార్డుల బహూకరణ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమా తరహాలో నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్ఠ పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
సెక్రటేరియట్‌లో అవార్డలు కోసం లోగోతో సహా విధి విధానాలు, నియమ, నిబంధనలపై కమిటీ సమావేశం జరిగింది. ఫీచర్ ఫిల్మ్స్, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగా కింద అవార్డులు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.












Click it and Unblock the Notifications