'గేమ్‌ఛేంజర్‌' ఫస్ట్ రివ్యూ... హిట్టా? బ్లాక్‌బస్టరా?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పాన్ ఇండియా సినిమా. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య డిజాస్టర్ కావడంతోపాటు ఆ సినిమా తర్వాత తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను మధ్యలో ఆపేసి భారతీయుడు2 చేసి దేశంలోనే అత్యంత చెత్త డిజాస్టర్ ను శంకర్ మూటకట్టుకున్నాడు. దీంతో గేమ్ ఛేంజర్ ఎలా తీసివుంటాడా? అనే అనుమానం, సందేహం మెగా అభిమానుల్లో నెలకొంది.

సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి
ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేసిన తర్వాత మాట్లాడారు. ఈ సినిమాలోని అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తుందని చెప్పారు. దీంతో సూర్య చెప్పినదాని ప్రకారం సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ పక్కా అని రామ్ చరణ్ అభిమానులు సంబరంగా చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగబోతోంది. అలాగే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఓ వేడుక జరపబోతున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.

game changer first review and actor sj surya opinion on this movie

పవన్ కల్యాణ్ షెడ్యూల్ ను బట్టి..
పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఆధారంగా ఈవెంట్ ఎప్పుడు జరిగేది సినిమా యూనిట్ నిర్ణయించనుంది. దీంతోపాటు ఏపీలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి కూడా వచ్చే అవకాశం ఉంది. నాయక్ సినిమా తర్వాత రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిని సినిమా కావడంతోపాటు 2025 ప్రారంభంలో చెర్రీ మెగా హిట్ కొట్టబోతున్నాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ ఈ సినిమా వేడుకకు హాజరైతే బాక్సాఫీస్ దగ్గర కూడా గేమ్ ఛేంజర్ అవుతుందంటున్నారు. దీనితర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను చేయనున్నాడు రామ్ చరణ్. ఇది పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+