విశ్వక్ సేన్ మూవీకి అంతర్జాతీయంగా దక్కిన గౌరవం
టాలీవుడ్ యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ వెళ్తున్నారు. ఫలక్ నామా దాస్, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో యువతకు దగ్గరయ్యారు విశ్వక్. ఆ తర్వాత హిట్ 1, హిట్ 2 చిత్రాలతో అలరించారు. అనంతరం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు విశ్వక్ సేన్. ప్రస్తుతం షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఓ చిత్రం చేస్తున్నారు.
గామి సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు..
విశ్వక్ సేన్ నటించిన చిత్రాల్లో ఒకటి గామి. ఈమూవీ 2024 మార్చి 8న విడుదలైంది. ఈ మూవీలో చాందిని చౌదరీ, అభినయ, హారిక,దయానంద్ రెడ్డి, మహమ్మద్ సమద్, శాంతిరావు,మయాంక్ పరక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. నిర్మాతగా కార్తిక్ శబరీష్ వ్యవహరించారు. గతేడాది రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డామ్ 2025 కు ఈ చిత్రం ఎంపికైంది.

ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 9 వరకూ జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దీనిపై చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈ మూవీ ఎపిక్ అడ్వెంచర్ త్రిల్లర్ గా తెరకెక్కింది. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఓ అరుదైన వ్యాధితో విశ్వక్ సేన్ బాధపడుతూ ఉంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతడిని వెలివేస్తారు.ఈ క్రమంలో తనను తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు విశ్వక్ సేన్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.












Click it and Unblock the Notifications