సుమ భర్త "నా ఫస్ట్ క్రష్".. బాంబ్ పేల్చిన మరో తెలుగు యాంకర్ !
తెలుగు ప్రేక్షకులకు నటి, యాంకర్ "గాయత్రి భార్గవి" సుపరిచితురాలే. దిగ్గజ దర్శకుడు బాపుకి ఆమె స్వయంగా మనవరాలు అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ తన కష్టంతోనే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోగలిగారు. గతంలో ఈటీవీ, జెమినీతో పాటు పలు ఛానెల్స్‌లో ఆమె పనిచేశారు. అంతే కాకుండా గాయత్రి భర్త విక్రమ్ ఆర్మీలో ఉన్నతాధికారిగా దేశసేవ చేస్తున్నారు. అలాగే కెరీర్‌ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ టాప్ యాంకర్.
లేటెస్ట్ గా గాయత్రి నటిస్తోన్న "డాటరాఫ్ ప్రసాదరావు కనబడుట లేదు" వెబ్ సిరీస్ ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఆమెతో పాటు రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్, హిమబిందు సహా పలువురు కీలకపాత్రలు పోషించారు. సౌతిండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కేవీ శ్రీరామ్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించగా.. కృష్ణ పోలారు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటి గాయత్రి భార్గవి మాట్లాడుతూ.. రాజీవ్ కనకాల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఆమె ఏమన్నారంటే..
ఈ సినిమాలో తాను చిన్నపాత్ర చేస్తున్నానని.. తనను మొదటిసారి టెలివిజన్ ఇండస్ట్రీకి పనికొస్తుందని చెప్పింది రాజీవ్ గారే అని చెప్పారు. అప్పట్లో రాజీవ్, బెన్నం ఒక బైక్‌పై వచ్చి తన ఫోటో చూసి ఈ అమ్మాయి ఓకే అని వెళ్లిపోయారన్నారు. ఆ విధంగా రాఘవేంద్రరావు యాడ్స్ చేయడానికి రాజీవ్ అప్రూవ్ చేశారని.. అప్పటి నుంచి రాజీవ్ తనకు తెలుసన్నారు. అలా దూరదర్శన్‌లో రకరకాల ప్రోగ్రామ్స్‌లో చూసిన రాజీవ్ తనకు ఫస్ట్ క్రష్ అని వివరించారు. అందుకనే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటామని.. అసలు అన్నా, గిన్నా లాంటివి అనమని చెప్పారు. మళ్లీ ఇప్పుడు రాజీవ్ తో కలిసి పనిచేయడం బాగుందన్నారు.
తెలుగు వారిమి ఉన్నాం..
అంతే కాకుండా తెలుగువారిని తీసుకుని అవకాశాలు ఇచ్చినందుకు నిర్మాతకు గాయత్రి థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. తామంతా ఆర్టిస్ట్‌లుగా మంచి ఆకలి మీద ఉన్నామని.. మంచి మంచి పాత్రలు చేద్దామని, మీలాంటి వాళ్లు అవకాశం ఇస్తే తినేస్తామని వెల్లడించారు. నటించడం కోసం విమానమెక్కి రానక్కర్లేదని.. లోకల్‌లో కార్‌లో, ట్రైన్‌లో వచ్చి కూడా చేస్తామన్నారు. త్వరలో తెలుగు భాషా దినోత్సవం వస్తోందని.. ఈ సందర్భంగా తెలుగువారితో ఇలాంటివి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు తెలుగునాట స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల. సినిమా అయినా, టీవీ అయినా, ఏ ఈవెంట్ అయినా సుమదే డామినేషన్. ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా సినిమాల్లో రాణిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు సుమ. వీరికి ఓ కూతురు, కొడుకు సంతానం. కుమారుడు రోషన్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజీవ్ కనకాల సైతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాగా బిజీ అయ్యారు.












Click it and Unblock the Notifications