"పెద్ది" కాదు పెను సునామీ.. నిజమైన అర్థం చెప్పేసిన చాట్ జీపీటీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మూవీ RC16 పై సంచలన అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ మూవీకి 'పెద్ది'అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. రా అండ్ రస్టిక్ లుక్ లో చెర్రీ అదరగొట్టారు. ఓ చేత్తో బీడీ కాలుస్తూ ఉన్న పిక్, మరో లుక్ లో చేతిలో ఏదో పట్టుకుని ఫైటింగ్ కు రెడీగా ఉన్నారు. ఈ రెండు లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్ది కాదు పెను సునామీ అంటూ మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై డియర్ చరణ్ అని పోస్ట్ చేశారు. పెద్ది చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోందని.. చెర్రీలోని నటనను మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా పెద్ది నిలుస్తుందన్నారు. ఫ్యాన్స్ కు ఈ చిత్రం కనులపండగ కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెద్ది అర్థం ఏంటి..?
అయితే ఇప్పుడు పెద్ది కి అర్థం ఏంటోనని మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని సైతం చర్చించుకుంటున్నారు. అయితే పెద్ది కి సరైన అర్థం ఏంటో చాట్ జీపీటీ చెప్పేసింది. పెద్ది అనే టైటిల్ కు ముఖ్యంగా రెండు అర్థాలను చాట్ జీపీటీ మనముందు ఉంచింది. ఒకటి పెద్ది అంటే దక్షిణ భారత్ లో ఇంటి పేరు లేదా ఇంటి పెద్ద అనే భావంతో పిలుస్తారట. దక్షిణ భారత్ లోని కొన్ని తెగల్లో ఇప్పటికీ పెద్ది అంటారని చెప్పింది. మరో అర్థంలో పెద్ది అంటే గ్రామీణ వాతావరణం, గ్రామీణ తెగలు అనే అర్థం వస్తుందని పేర్కొంది.
A FIGHT FOR IDENTITY!! #RC16 is #Peddi.
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2025
A @BuchiBabuSana film.
An @arrahman musical.@NimmaShivanna #JanhviKapoor @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/fuSN5IjDL1
పెద్ది అంటే మస్క్ 'గ్రోక్' ఏం చెప్పింది..?
ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ గ్రోక్ పెద్ది అంటే మరోవిధంగా అర్థం చెప్పింది. పెద్ది అంటే కన్నడ భాషలో ఫూలిష్ లేదా స్టుపిడ్ ఉమెన్ అని అర్థం వస్తుందని పేర్కొంది. మరో అర్థంలో పెద్ది అంటే ఓ తెగకు సంబంధించిన కల్చరల్, రూరల్, భాషాపరమైన ప్రాంతం అని తెలిపింది. మరి ఈ సినిమా రిలీజైతేనే నిజమైన అర్థం ఏంటో మనకు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా 1980 ల నాటి స్పోర్ట్స్ నేపథ్యంలో సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. 'ఉప్పెన' బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు.. దాదాపు రెండేళ్లపాటు ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుందని ఇవాళ రిలీజైన పోస్టర్లు చూస్తేనే తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ రెండు భాగాలుగా రానుందని మరికొంతమంది అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
-
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications