ఆ టైంలో బాత్రూమ్‌కి వెళ్లడం నరకం..పచ్చిగా చెప్పేసిన అనసూయ
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె పాపులారిటీ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేస్తుంటుంది అనసూయ.ఇటీవల అనసూయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి, ఇందులో ఆమె 9 గజాల చీర కట్టుకుని ఉంది. ఈ ఫొటోలతో పాటు, ఆమె 9 గజాల చీరల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు, అవి "రాయల్ లుక్" ఇస్తాయని పేర్కొన్నారు.అయితే, ఈ చీరలో ఎంత అందంగా కనిపించినా, దాన్ని ధరించినప్పుడు ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల గురించి ఆమె సరదాగా పంచుకున్నారు. ముఖ్యంగా, బాత్రూమ్‌కి వెళ్లడం నిజంగా నరకం అని ఆమె వ్యాఖ్యానించారు.
అనసూయ వ్యాఖ్యలపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చాలా మంది అభిమానులు ఆమె నిజాయితీని అభినందిస్తున్నారు. అనసూయ ఏం చెప్పినా నిజంగానే చెప్పేది... ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటుందంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కొందరు ఈ వ్యాఖ్యలపై సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు ఇలాంటి విషయాల్ని ఓపెన్‌గా చెప్పడం చాలా కరెక్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అనసూయ ఎప్పుడూ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తారని, ఇది ఆమె అభిమానులకు బాగా నచ్చుతుందని ఈ స్పందనలు మరోసారి నిరూపించాయి.
-
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా?












Click it and Unblock the Notifications