ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న డార్లింగ్..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే డార్లింగ్ ప్ర‌భాస్ పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.. అయితే, ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచ‌ల‌ర్ ఎవ‌రూ అంటే ప్ర‌భాస్ పేరే ముందుంటుంది. ఎందుకంటే, ఆయ‌న కంటే చిన్నవాళ్లు ఇప్ప‌టికే పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం పెళ్లిచేసుకోకుండా చేతినిండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ చాలాసార్లు ప్ర‌భాస్ పెళ్లి గురించి బోలెడ్ రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే, తాజాగా మ‌రో వార్త నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని మ‌రోసారి ఈ వార్త హాట్‌టాపిక్ అయ్యింది. అయితే, కల్కి సమయంలో ప్ర‌భాస్ పెళ్లిగురించి స్పందించారు. నా పెళ్లివ‌ల్ల లేడీ డై హార్డ్ ఫ్యాన్స్ బాధపడతారనే మ్యారేజ్ చేసుకోవడం లేదంటూ.. ఫన్నీగా మాట్లాడాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్ర‌భాస్ ఓ ఇంటి వాడయితే చూడాలనుకుంటున్నారు.

Good news for Prabhas fans Darling who is going to get married soon

పెద్ద‌మ్మ నోట పెళ్లిమాట‌..

అయితే, ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న డార్లింగ్ పెళ్లిక‌బురు రానే వ‌చ్చింది. ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా డార్లింగ్ పెద్దమ్మ శ్యామలా దేవీ చెప్ప‌డం విశేషం. ఇటీవల విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆమె కాసేపు మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సమయంలో ఆమెకు ప్రభాస్ పెళ్లి ఎప్ప‌డంటూ ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. పెళ్లిపై నెలకొన్న ఉత్కంఠ‌కు తెరదించారు ప్ర‌భాస్ పెద్ద‌మ్మ‌. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చేశారు. పెళ్లికూతురు ఎవ‌రూ.. పెళ్లిఎప్ప‌డు వంటి వివ‌రాల గురించి ఆమె ప్ర‌స్తావించ‌లేదు కానీ, ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నాడంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక‌, యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త తెలియగానే ఆయ‌న అభిమానులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ప‌లు చిత్రాలు..

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో ప‌లు చిత్రాలు ఉన్నాయి. సలార్ 2, మారుతి డైరెక్షన్ లో హారర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెర‌కెక్క‌బోతున్న‌ రాజా సాబ్ వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా కూడా చేయ‌బోతున్నాడు. వీటితో పాటు మ‌రికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+