విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్.. డేట్ ఫిక్స్
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా మూవీ నుంచి ఏ అప్డేట్ రాకపోవడంతో.. విజయ్ ఫ్యాన్స్ అంతా బాగా హర్ట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అభిమానుల అందరికీ తీపికబురు చెప్పింది మూవీ యూనిట్.
టీజర్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. మా ప్రపంచాన్ని, మా కథను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పోస్ట్ చేశారు. టైటిల్ అండ్ టీజర్‌తో మీరంతా గర్వపడతారని పేర్కొన్నారు. ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు.. టీజర్ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని రాసుకొచ్చారు. అలానే నిర్మాత నాగవంశీ కూడా ప్రపంచాన్ని ఉత్కంఠభరితమైన శిఖరానికి తీసుకెళ్లడానికి మేం సిద్ధంగా ఉన్నామంటూ పోస్టర్ ను షేర్ చేశారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ టీజర్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఎట్టకేలకు ఫైనల్ గా మూవీ నుంచి అప్డేట్ వచ్చినందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
You have all been patient.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 7, 2025
We have felt your tough love.
We are now ready to open our world, our story and all our hearts to you.
With a Title and Teaser you will be proud of! #VD12 pic.twitter.com/aGkBee1o6S
ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఈ సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు గౌతం తిన్ననూరి జెర్సీ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో విజయ ఫ్యాన్స్ సైతం ఈసారి హిట్ కొట్టడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications