'కొబ్బరి మట్ట' కాదు.. ఈసారి తాట తీసే విలన్ గా సంపూ..!

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కాలీ ఫ్లవర్ చిత్రాలతో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన హీరో సంపూర్ణేష్ బాబు. తాజాగా ఆయన కొత్త అవతారం ఎత్తారు. పక్కా ఊర మాస్ విలన్ గా కనిపించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓ చేతితో సిగరెట్ పట్టుకుని.. మరో చేతితో కత్తి పట్టుకుని వైలెంట్ గా ఉన్నారు సంపూ. ఇంతకీ ఆ చిత్రం ఏంటని అనుకుంటున్నారా..?

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్.. ఇదివరకు ఇద్దరి కాంబోలో వచ్చిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి కాంబోలో ది ప్యారడైజ్ మూవీ రానుంది. ఈ మూవీ ఓ భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. నాని బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో నటించనున్నారు. ఈ పాత్ర పేరు బిర్యానీ.. తాజాగా సంపూర్ణేష్ బాబుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

Goosebumps Guaranteed Nani Unveils Sampoornesh Babu s Fierce Biryani Look in The Paradise

ఎప్పుడూ తనదైన కామెడీతో నవ్వించే సంపూర్ణేష్ బాబును ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల పూర్తిగా మార్చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో అంటే తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ లో విడుదలకానుంది. ది ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు మెయిన్ విలన్ గా చేస్తున్నారు. అలాగే రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+