గిన్నీస్ రికార్డు సాధించిన హీరో శోభన్ బాబు మనవడు..!
తెలుగు సినీ లోకంలో శోభన్ బాబు అనే పేరు ఒక స్వర్ణాక్షరంగా నిలిచిపోయింది. ఆయన నటించిన సినిమాలు నేటికీ ప్రేక్షకుల మనసులో మిగిలేలా చేస్తాయి. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడు, తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇక ఈ లోకంలో లేకపోయినా, ఆయన కళా వారసత్వం తెలుగు సినీ ప్రపంచంలో ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. కానీ శోభన్ బాబు మాత్రం తన కుటుంబ సభ్యులను సినిమా రంగానికి పరిచయం చేయలేదు.
అయితే ఆయన వారసులు ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ శోభన్ బాబు పేరును మరో కోణంలో వెలిగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన, వైద్య రంగంలో ఓ అద్భుత విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

గిన్నిస్ రికార్డు..
చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ సురక్షిత్ ఇటీవల ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో ఏర్పడిన 4.5 కిలోల సిస్టును, సాధారణంగా ఓపెన్ సర్జరీ చేయాల్సిన స్థితిలో ఉన్నా, అత్యాధునిక "ట్రూ 3డి ల్యాపరోస్కోపిక్" పద్ధతిలో తొలగించి చరిత్ర సృష్టించారు. ఈ విజయం వైద్య రంగంలో ఒక సంచలనం గానూ నిలిచింది. సుమారు ఎనిమిది గంటల పాటు నిరంతరంగా శస్త్రచికిత్స చేసి, సురక్షిత్ విజయవంతంగా ఆ ఆపరేషన్‌ను పూర్తిచేశారు. ఈ ఆపరేషన్ ద్వారా మహిళా ప్రాణాలను రక్షించడమే కాక, అత్యాధునిక సాంకేతికత సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు.
2016లో చెన్నైలో 'ఇండిగో ఉమెన్స్ సెంటర్'ను స్థాపించిన డాక్టర్ సురక్షిత్, అప్పుడే "ట్రూ 3డి ల్యాపరోస్కోపిక్" టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఆయన చేసిన పది వేలకుపైగా సర్జరీలు వైద్యరంగంలో ఆయన కృషికి నిదర్శనంగా నిలిచాయి. సులభ రికవరీతోనే కాకుండా, అధునాతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే శోభన్ బాబు సినీ రంగంలో ఎలా తనదైన ముద్ర వేసారో, మనవడు సురక్షిత్ వైద్య రంగంలో కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. డాక్టర్ సురక్షిత్ నిజంగా తాత గర్వపడే మనవడిగా నిలిచిపోతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications