Gunde Ninda Gudi Gantalu : సెప్టెంబర్ 15 ఎపిసోడ్.. బాలుని ఇబ్బందులు పెట్టిన మనోజ్ !

ప్రముఖ ఛానల్‌లో ప్రసారం అవుతున్న "గుండెనిండా గుడిగంటలు" సీరియల్.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా సెప్టెంబర్ 15వ తేదీన ప్రసారం కానున్న 510వ ఎపిసోడ్ హాస్యభరిత సన్నివేశాలతో పాటు అనూహ్య మలుపులతో ఆకట్టుకుంది. కుటుంబ సంబంధాలు, దాంపత్యంలో తలెత్తే చిన్నచిన్న సమస్యలు, వాటి మధ్య వచ్చే హాస్యం ఈ ఎపిసోడ్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మనోజ్ - రోహిణి ఇబ్బందులు..

ఎపిసోడ్ ప్రారంభంలో రోహిణి హాల్లో పక్కపరుచుకొని పడుకోవడానికి సిద్దం అవుతుంటారు. కోటీశ్వరుడి కూతురివి ఇలా కింద పడుకోవాల్సి వచ్చింది" అని మనోజ్ అంటుంటాడు. అందుకు రోహిణి తాను కోటీశ్వరుడి కూతురు కాదన్న నిజాన్ని గుర్తుచేసుకొని బాధపడుతుంది. కానీ, "ఇంకా వారం రోజులు మాత్రమే భరించాలి. తరువాత శృతి, రవి పడుకోవాలి కదా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.

gunde-ninda-gudi-gantalu-september-15th-episode-details

బాలును ఇబ్బంది పెట్టిన మనోజ్..

మనోజ్ నిద్రపట్టదని చెప్పి పై అంతస్తుకు వెళ్ళి, "చార్జర్ మర్చిపోయాను" అంటూ బాలు గదిలోకి వస్తాడు. బాలు ఆత్రంగా తలుపు తీసినప్పటికీ, అతనికి నిరాశే మిగులుతుంది. తరువాత పిల్లో కావాలని అడిగి మళ్లీ డిస్టర్బ్ చేస్తాడు. ఈ సన్నివేశాలు హాస్యభరితంగా సాగుతాయి.

తరువాత మరోసారి బాలు గది తలుపు తట్టగానే, బాలు వేగంగా తలుపు తీయడంతో మనోజ్ నేరుగా అతడి మీద పడి ఇద్దరూ మంచం మీద పడిపోతారు. బాలు చిరాకు తోసి, దుప్పట్లు అన్నీ ఒకేసారి మనోజ్‌కు విసరేస్తాడు. "తీసుకుపోరా" అని అన్న బాలు, మనోజ్‌ను గదిలోంచి బయటకు పంపేస్తాడు.

హాల్లోకి తిరిగి వచ్చిన మనోజ్, "మనకంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలి, మనకి ప్రత్యేకమైన గది ఉండాలి" అని రోహిణిని ఒత్తిడి చేస్తాడు. రోహిణి మాత్రం, "ఇప్పుడే బిజినెస్ మొదలుపెట్టాం, ఇల్లు కొనడం సాధ్యం కాదు" అని చెప్పి నిద్రపోతుంది. కానీ మనోజ్ మాత్రం నిద్రపట్టక అటుఇటు తిరుగుతూనే ఉంటాడు.

బిజినెస్ ప్లాన్..

ఇక అప్పుడే నీళ్ల కోసం వచ్చిన ప్రభావతితో మనోజ్ నేను బిజినెస్ చేయబోతున్నాను. ఈ సమయంలో నిద్ర లేకపోతే ఎలా పని చేస్తాను? బాలు లాగా గేర్ మార్చడం నాకు రాదు, నాకు బుర్ర పెట్టాలి" అని అంటాడు. ప్రభావతి రోహిణి పరిస్థితి గుర్తుచేస్తూ, "ఈ వారం రోజులు భరించమని అంటుంది.

బాలు - మీనా కబుర్లు..

మరోవైపు, రాత్రి మీనా చాప, దిండు పట్టుకొని బాలు గదికి వస్తుంది. బాలు ఆశ్చర్యంగా "ఇక్కడ బెడ్ ఉంది కదా" అని అడగగా, మీనా "ఆడపిల్లకు పడుకునే మంచం, తినే కంచం కూడా ప్రత్యేకమే. నాకు ఈ మంచం మీద పడుకోవడం ఇష్టం లేదు" అని చెబుతుంది. దీంతో బాలు కూడా ఆమెతో పాటు కింద పడుకుంటాడు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు.

ఉదయాన్నే భోజనం సమయంలో మనోజ్ కునుకుపాట్లు పడుతుంటే బాలు ఆటపట్టిస్తాడు. మనోజ్ - రోహిణి తమ గది లేకపోవడంపై మళ్ళీ బాధపడ్డా, బాలు - మీనాలపై మాత్రం ఎలాంటి జాలి చూపించరు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న హాస్యభరిత మాటలాటలు చోటుచేసుకున్నాయి.

రాబోయే ఎపిసోడ్ ప్రివ్యూ

ఎపిసోడ్ చివర్లో మనోజ్ ఫర్నీచర్ షాప్ ఓపెనింగ్కి సంబంధించిన సీన్ చూపించారు. దాంతో రాబోయే ఎపిసోడ్‌లో మనోజ్ బిజినెస్ ప్రారంభం, కొత్త సమస్యలు, కొత్త ట్విస్టులు ప్రేక్షకులను మరింత ఆసక్తికరంగా ఆకట్టుకోనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+