Gunde Ninda Gudi Gantalu : సెప్టెంబర్ 9 ఎపిసోడ్.. బాలు ఫుల్ ఫైర్.. ముద్దులు పెట్టడం కూడా తెలుసంటూ !
ప్రముఖ ఛానల్‌లో ప్రసారం అవుతున్న "గుండెనిండా గుడిగంటలు" సీరియల్.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా సెప్టెంబర్ 9వ తేదీన ప్రసారం కానున్న 506వ ఎపిసోడ్ లో కూడా కథ నిజంగా ఊహించని మలుపులు తిరిగి ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.
బాలు ఫైర్..
బాలు ఆగ్రహంగా షర్ట్ విసిరేసి బయటకు వెళ్లిపోతాడు. వెంటనే అక్కడికి బస్తీ మహిళలు వచ్చి "మీ అల్లుడికి అంత కోపం పనికిరాదమ్మా" అంటూ చెబుతుంటారు. బాలు కారు స్టార్ట్ చేస్తూ.. మీనాను రమ్మని పిలవగా.. పార్వతమ్మ కంగారుగా "అమ్మా మీనా నువ్వు వెళ్లు, లేదంటే ఈ గొడవ ఇంకా పెరుగుతుంది" అంటూ ఆమెను కారు ఎక్కించింది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా బాలు కోపంగానే ఉంటాడు. మీనా కన్నీళ్ళతో "ఇప్పుడు షర్ట్ లేకుండా ఇంటికి వెళ్తున్నారు. అసలు శివకి, మీకు గొడవ ఏంటి? ఇద్దరూ ఎందుకు నిజం చెప్పరు? ఈ గొడవ అత్తయ్యకు తెలిస్తే ఊరుకుంటుందా?" అని అడిగింది. కానీ బాలు మాత్రం రియాక్ట్ అవ్వడు.

కొద్దిసేపటికి బాలు కారు ఇంటి ముందు ఆగింది. షర్ట్ లేకుండానే లోపలికి వచ్చిన బాలుని చూసి ఇంట్లో అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. సంజూ, మౌనిక కూడా కిందకి వస్తారు.. అప్పుడు సంజూ వెటకారంగా "ఇదేంటి బావా.. అత్తింటికి వెళ్తే బట్టలు పెట్టి పంపిస్తారు కదా.. మీ అత్తగారు ఏంటి పీకేసి పంపిందా?" అన్నాడు. మిగతా వాళ్లు కూడా ప్రశ్నలు వేయడంతో.. బాలు కోపంగా "గుడిముందు ఓ అడుక్కునేవాడు షర్ట్ లేకుండా కనిపించాడు.. అందుకే వాడికి ఇచ్చేసి వచ్చాను. ఇక మీరు ఏ కథ అయినా ఊహించుకోండి" అని చెప్పి పైకి వెళ్లిపోతాడు.
ప్రభావతి మాత్రం రోహిణీతో "దీని వెనుక ఏదో కథ ఉంది.. తెలుసుకోవాలి" అంది. రోహిణి మీనాని ఆపి ఆరా తీయగా, మీనా ఆగ్రహంగా "ఇది మా ఇంటి విషయం అని నీకు తెలియదా రోహిణీ? మొన్న మా ఆయన మీకు మీ నాన్నగారు డబ్బులు పంపించారు అన్నప్పుడు మీ సమస్య.. మీ ఇంటి గొడవ అని పెద్ద పెద్దమాటలు అన్నారు కదా.. మరి ఈ రోజు నువ్వు ఇలా అడుగుతుంటే.. నాకు కోపం రాకూడదా? నీకో న్యాయం నాకో న్యాయమా?" అని గట్టిగా సమాధానం ఇచ్చి వెళ్లిపోయింది. ఇదంతా చాటుగా విన్న ప్రభావతి "అమ్మో ఇంకా నయం నేను అడగలేదు.. అడిగి ఉంటే నా పరువు తీసేసేది ఈ మీనా" అని మనసులో అనుకుంది.
తర్వాత, మీనా సుశీలతో ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది. "మా తమ్ముడు, మా వారు ఎంతో ప్రేమగా ఉండేవారు.. బావా బావా అంటూ తిరిగేవాడు శివ. అలాంటిది ఏం జరిగిందో తెలియదు ఎదరుపడితే నిప్పులు కక్కుతున్నారు అంటుంది. సుశీల మీనాని ఓదార్చి బాలు దగ్గరకు తీసుకువెళ్లి "దాన్ని ఎందుకురా ఏడిపిస్తావ్ పెళ్లి రోజు రోజున" అని మందలించింది. బాలు "నాకేం దీని మీద కోపం లేదు.. అక్కడిక్కడే వదిలేశాను" అని మరో షర్ట్ వేసుకుని రావడంతో, సుశీల నవ్వుతూ "నీ గురించి నాకు తెలుసురా.. ఇద్దరూ కలిసి రండి" అని చెప్పి కిందకు వెళ్లిపోయింది.
ముద్దులు పెట్టడం కూడా తెలుసు..
అప్పుడు బాలు ప్రేమగా మీనాతో "నా ముద్దుల పూలగంపవి కదా.. ఏడవకు.. ఏడిపించను అని మాటిచ్చాను కదా.. సారీ.. వదిలెయ్.. పదావెళ్దాం" అన్నాడు. మీనా అలిగినట్లుగా "అబ్బో మీకు ముద్దుచేయడం కూడా తెలుసా" అనగా, బాలు "ముద్దులు పెట్టడం కూడా తెలుసు" అని దగ్గరకు రాబోతుంటే మీనా ఆపి "పదండి వెళ్దాం, కింద మనకోసం ఎదురు చూస్తున్నారు" అంది. ఇద్దరూ కిందకు వస్తారు. కటింగ్ సమయంలో సంజూ ఒక లెటర్ పట్టుకుని "సర్ప్రైజ్ గిఫ్ట్ బావా నీకోసం" అన్నాడు. దాన్ని తీసుకున్న మనోజ్ "బావ గారు ఈ బాలు గాడికి పర్సనల్ డ్రైవర్ జాబ్ ఇచ్చారు" అని అందరితో చెప్పాడు.
కమింగ్ అప్..
కేక్ కటింగ్ పార్టీలో శ్రుతి తల్లి, కామాక్షి కూడా ఉన్నారు. మరి బాలు ఏ సమాధానం ఇస్తాడో, సంజూ అవమానాన్ని ఎలా తిప్పికొడతాడో ప్రేక్షకులు ఆసక్తి పెంచుతుంది. మరి ఆ విషయం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications