Guntur Kaaram Trailer: మహేష్ అడ్డాలో.. సామి విశ్వరూపం
Guntur kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్.. సినిమా సత్తాను చాటింది. మహేష్ బాబు స్టామీనాను నిరూపించింది. ఆయనలోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. మాస్ లుక్స్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారాయన. డాన్స్, ఫైట్స్‌లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

గుంటూరు కారం పోస్టర్లు.. సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేలా చేస్తోన్నాయి. సర్కారువారి పాట బ్లాక్ బస్టర్, మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో మూవీ ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
గడువు సమీపిస్తోండటంతో.. విడుదల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. థియేటర్లను ఇదివరకే బుక్ చేసుకున్నారు నిర్మాతలు. నైజాం ఏరియా హక్కులను మైత్రీ మూవీస్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడంపైనా నిర్మాతలు దృష్టి పెట్టారు. ఏపీలో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లల్లో టికెట్ ఒక్కింటిపై 75 రూపాయలు, తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లల్లో ఒక్కో టికెట్‌పై 65, మల్టీ ప్లెక్స్‌లల్లో 100 రూపాయల మేర పెంచుకోవడానికి అనుమతులను కోరారు.

ఈ నెల 10వ తేదీ లోపల టికెట్ల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడొచ్చు. ఇక 9వ తేదీన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపాలని సినిమా యూనిట్ నిర్ణయించింది.
ఈ సినిమా ట్రైలర్‌పై తాజా అప్‌డేట్ వచ్చింది. నేడే ట్రైలర్ విడుదల కానుంది. ఈ సాయంత్రం హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ కానుంది. మూడు నిమిషాలకు పైగా ట్రైలర్ నిడివిని కట్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని ప్రధాన క్యారెక్టర్లను ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం, మహేష్ బాబు మాస్ విశ్వరూపాన్ని ప్రదర్శించేలా ట్రైలర్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications