'గుంటూరు కారం' రేటింగ్ ఎంతో తెలుసా?
గుంటూరు కారం టీమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సినిమాకు ఫేక్ రివ్యూలు, ఫేక్ రేటింగ్స్ ఇస్తున్నారంటూ బుక్ మై షోపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. గుంటూరు కారం సినిమాకు 0/1 రేటింగ్ ఇవ్వడం కోసం 70వేల ఫేక్ అకౌంట్లు క్రియేటయ్యాయని, వాటితో తమ సినిమాకు ఫేక్ రేటింగ్స్ ఇచ్చారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సినిమాకు మొదటినుంచి పాజిటివ్ టాక్ వచ్చిందని, ఫ్యామిలీ ఆడియన్స్ అమ్మ సెంటిమెంట్ కు బాగా కనెక్టయ్యారని, మహేష్ బాబు నటన యూత్ ను ఆకట్టుకుందని నిర్మాతలు మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి మరీ తెలియజేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజు కలెక్షన్లు అంటూ ఓ పోస్టర్ వచ్చింది. ఎక్కువ వసూలు చేసిన మొదటి ఒరిజినల్ సినిమా అంటూ ఆ పోస్టర్‌లో ఉంది.

గుంటూరు కారం సినిమాకు మొదటిరోజు రూ.111 కోట్లు వచ్చినట్లు అందులో ఉంది. దీన్ని నిర్మాతలే సిద్ధం చేశారని, సినిమా విడుదలకు ముందురోజే దీన్ని రెడీచేసి పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. కలెక్షన్ల గురించి స్పష్టత లేకుండా ముందుగానే దీన్ని ఎలా రెడీ చేస్తారని, అన్నీ ఫేక్ కలెక్షన్లు వేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి.
ఈ సినిమా మొదటిరోజు రూ.94 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ విడుదల చేశారు. ఇందులో కూడా ఫేక్ కలెక్షన్లు ఉన్నాయని, గుంటూరు కారం సినిమాకు మొదటిరోజు రూ.80 కోట్లకు మించి వసూలు చేయలేదని కొందరంటున్నారు. తాజాగా ఈ సినిమా ఫేక్ రివ్యూలపై అందరి దృష్టి పడింది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. బుక్ మై షోకి ఓ లేఖ రాసింది. గుంటూరు కారం మూవీకి ఫేక్ రేటింగ్స్ ఇచ్చిన వాళ్ల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని విచారణ జరిపి తెలుసుకోవాలని బుక్ మై షోని ఫిల్మ్ ఛాంబర్ కోరింది.












Click it and Unblock the Notifications