సోదరుడ్ని సీక్రెట్ గా పెళ్లాడిన హీరోయిన్..? ఇంకెవరూ దొరకలేదా తల్లి..!!

పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటి హనియా ఆమిర్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎప్పుడూ తన పోస్టులు, రీల్స్ తో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మరో విధంగా నెట్టింట్ వైరల్ అవుతోంది. తనకు కజిన్(సోదరుడి) వరుస అయిన వ్యక్తితో హనియా సీక్రెట్ వివాహం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు లాహోర్ 3 రోజుల పాటు ఈ వేడుక అతికొద్ది మంది సమక్షంలో జరిగినట్లు మీడియా వర్గాల కథనం ద్వారా వెల్లడవుతోంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టులో వివాహం జరిగిన ప్రాంతం షాలిమార్ గార్డెన్స్ అని అలాగే ఈ వివాహానికి వచ్చిన సెలబ్రిటీల లిస్టు కూడా వైరల్ అయింది. నటి హనియా ఆమిర్ వివాహానికి పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మహిరా ఖాన్, ఫవాద్ ఖాన్ కూడా హాజరయ్యారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తను హనియా ఆమిర్ క్లోజ్ ఫ్రెండ్ యష్మా గిల్ కొట్టిపడేశారు. ఆమె తన కజిన్ ను పెళ్లిచేసుకుందన్న వార్తలో నిజం లేదని తేల్చింది. నెట్టింట సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలు చూసి ఒక్కసారిగా నవ్వువుకున్న యష్మా.. ఈ పెళ్లి గురించి తనకు తెలియనే లేదే అని వ్యంగ్యంగా బదులిచ్చారు.

ఆ వైరల్ పోస్టుల్లో కనిపిస్తున్న లగ్జరీ అవుట్ ఫిట్స్, ఫ్యామిలీ ట్రెడిషన్స్, అవన్నీ ఫేక్ అని యష్మా పేర్కొన్నారు. ఇంటర్నెట్ లో ఇలాంటి తప్పుడు సమాచారం వేగంగా సర్క్యూలేట్ అవుతుందని తెలిపారు. ఇక నటి హనియా ఆమిర్ గురించి ఎప్పుడూ నెట్టింట పలు రకాలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. హనియా ఆమీర్ కు సింగర్ అసిమ్ అజార్ కు మధ్య రిలేషన్ ఉందని.. వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఇరువురి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

HaniaAamir Marriage Rumours Social Media Claims She Wed Her Cousin Hania Aamir wedding rumours

ఇక కజిన్ మ్యారేజీలు పాకిస్థాన్ లో సర్వసాధారణం అని టాక్. చాలామంది సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ వాళ్లనే వివాహం చేసుకున్నట్లు సమాచారు. పాకిస్థాన్ లో దాదాపు 40 శాతం పెళ్లిళ్లు ఇలాగే జరుగుతాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+